Bothell, Washington: మార్చి 6న బొతెల్లోని ఎంపైర్ బ్యాంక్వెట్ హాల్లో వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (Washington Telangana Association – WATA) నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా, గర్వంగా, హౌస్‌ఫుల్‌గా జరిగాయి. ఈ వేడుకలో 500కి పైగా మహిళలు పాల్గొని, మహిళా శక్తిని, ఐక్యతను, ఆనందాన్ని అద్భుతంగా ప్రతిబింబించారు.
SHERO అవార్డులతో ఘన ఆరంభం
తమ తమ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ, కమ్యూనిటీకి సేవ చేస్తున్న మహిళలను (Women) సత్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన SHERO అవార్డులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మహిళల ఆరోగ్యానికి ప్రోత్సాహం – స్టెప్స్ చాలెంజ్ విజేతలకు సత్కారం
ఒక నెలపాటు నిర్వహించిన స్టెప్స్ చాలెంజ్‌లో విజయం సాధించిన మహిళలను వేదికపై సత్కరించడం ద్వారా ఆరోగ్యంపై అవగాహనను (Health Awareness) మరింత బలపరిచారు.
ఫ్యాషన్ వాక్ – అందం, ఆత్మవిశ్వాసం, అద్భుత ప్రదర్శన
రంగురంగుల దుస్తులు, మెరిసే చిరునవ్వులు, నిండైన ఆత్మవిశ్వాసంతో మహిళలు చేసిన ఫ్యాషన్ వాక్ (Fashion Walk) ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విజేతలు అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఫన్ గేమ్స్, ఎనర్జీతో నిండిన వాతావరణం
అందరినీ అలరించే ఆటలు, నవ్వులతో నిండిన క్షణాలు — వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ మహిళా దినోత్సవ వేడుకల (International Women’s Day) ఈవెంట్ మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది.
రుచికరమైన వెజ్ & నాన్-వెజ్ విందు
ఈ WATA మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఎనర్జీని పెంచేలా ప్రత్యేకంగా సిద్ధం చేసిన విందు ఈ వేడుకకు మరింత రుచిని జోడించింది.
DJ & బ్యాండ్‌తో గ్రాండ్ ఫినాలే
సంగీతం, డాన్స్, ఆనందంతో ముగిసిన ఈ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (Washington Telangana Association – WATA) మహిళా దినోత్సవ వేడుకల వేడుక మహిళల శక్తిని, ఐక్యతను, ఆనందాన్ని మరింత వెలిగించింది.
మహిళల కోసం – మహిళల చేత – మహిళలతో కలిసి జరుపుకున్న అద్భుత వేడుక. సియాటిల్ (Seattle, Washington) లో మహిళా దినోత్సవాన్ని ఇంత అద్భుతంగా జరిపిన వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్‌కు, నిర్వాహకులకు, పాల్గొన్న ప్రతి మహిళకు హృదయపూర్వక అభినందనలు.