తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త క్రీడా కార్యక్రమాలను నెత్తి కెత్తుకోవడంలో ముందు వరుసలో ఉంటున్నారు. ఇప్పటికే బాస్కెట్ బాల్, చెస్, వికలాంగుల క్రికెట్, ఫ్లాగ్ ఫుట్బాల్ లీగ్, జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వంటి తానా క్రీడా కార్యక్రమాలను నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా నిర్వహించారు.
ఈ యంగ్ అండ్ డైనమిక్ తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ఇప్పుడు కొత్తగా తానా చరిత్రలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళల త్రోబాల్ ఛాంపియన్షిప్ కి రూపకల్పన చేశారు. తానా క్రీడల్లో ఒక కొత్త శకం ఆరంభం అయ్యింది అనేట్టు 16 జట్లు పాల్గొనేలా ఈ త్రోబాల్ ఛాంపియన్షిప్ రూపొందించారు.
క్రికెట్ టోర్నమెంట్ ద్వారా మంచి ఊపు తేవడమే కాకుండా తానా కార్యక్రమాలకు ఎప్పుడూ అండగా నిలిచే తానా అపలాచియన్ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి, మహిళా కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్న తానా మహిళా కార్యదర్శి డా. ఉమ కటికి ఆరమండ్ల, తానా నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటున్న కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, తానా స్పోర్ట్స్ & గేమ్స్ ఛైర్ రాజ్ యార్లగడ్డ, ఈవెంట్ ఎడ్వైసర్స్ వసంత కావూరి మరియు మను ఆలపాటి తమ సంపూర్ణ సహాయ సహకారాలను ఈ ఛాంపియన్షిప్ కి అందిస్తున్నారు.
వచ్చే సెప్టెంబర్ లాంగ్ వీకెండ్ లో 3 – 4 తారీఖుల్లో అపలాచియన్ రీజియన్, నార్త్ కెరొలినా రాష్ట్రం లోని చార్లెట్ నగరంలో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీని అవాన్స ఐటీ సోలుషన్స్ తరపున తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి అందిస్తున్నారు. ఇంకా మూవర్స్.కామ్ నుంచి తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్య గారపాటి మరియు టెక్ రియాల్టీ నుంచి చంద్ర మావులూరి స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నారు.
ట్రోఫీలతోపాటు విజేతలకు $1500 క్యాష్ బహుమతి, రన్నర్స్ కు $750 క్యాష్ బహుమతి ఉన్న ఈ తానా మహిళల త్రోబాల్ ఛాంపియన్షిప్ కి రెజిస్ట్రేషన్ ఫీజు $250. అమెరికాలో ఉన్న ఏ మహిళా జట్టైనా రెజిస్టర్ చేసుకోవచ్చు. వివరాలకు తానా వెబ్సైట్ ని సందర్శించండి. తమ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి మహిళలు అందరూ త్వరగా తమ జట్లను రెజిస్టర్ చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నారు నిర్వాహకులు.