Connect with us

Associations

వేటా నూతన కార్యవర్గ సమావేశం, బాధ్యతల స్వీకరణ @ Bay Area, California

Published

on

ఝాన్సీ రెడ్డి హనుమండ్ల ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ కార్య వర్గ సభ్యులు కాలిఫోర్నియా, శాన్ఫ్రాన్సిస్కో, బే ఏరియాలోని సిలికాన్ వాలీలో సమావేశమయి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన శైలజ కల్లూరి అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు శైలజ కల్లూరి మాట్లాడుతూ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ లాంటి గొప్ప సంస్థకు అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాని, అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ వేటా (WETA) అని అన్నారు.

అటువంటి గొప్ప ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ను ముందుండి నడిపించాల్సిన భాద్యతను ఝాన్సీ రెడ్డి హనుమండ్ల (Jhansi Reddy Hanumandla) మరియు సభ్యులు తన మీద నమ్మకం ఉంచినందుకు సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా నూతన కార్యక్రమాలు రూపొందించి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అందుకు సంస్థ సభ్యుల సహకారం మరియు పెద్దల ఆశీస్సులు కావాలని ఆశించారు. ఆర్గనైజషన్ ముందు ముందు చేయాలనుకొంటున్న ప్రోగ్రామ్స్ గురించి వివరించారు.

ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (Women Empowerment Telugu Association – WETA) ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ అడ్వైసర్, ప్రముఖ NRI ఝాన్సీ రెడ్డి హనుమండ్ల సంస్థ యొక్క ఉద్దేశ్యం, గోల్స్, ఆర్గనైజషన్ ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు గురించి వివరించారు.

మిగతా రాష్ట్రాలలో ఉన్న వేటా (WETA) కార్య వర్గ సభ్యులు వర్చ్యువల్ గా ఆన్లైన్లో ప్రమాణ స్వీకారం చేశారు. అడ్వైసరీ కౌన్సిల్ (Advisory Council) కో-చైర్ డా. అభితేజ కొండా మిగతా నూతన కార్య వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శైలజ కల్లూరి టీం కి అందరూ అభినందనలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected