Connect with us

Women

లెఫ్టినెంట్ గవర్నర్ అరుణ మిల్లర్ అతిథిగా మేరీల్యాండ్లో WETA మాతృ దినోత్సవ వేడుకలు

Published

on

ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఆధ్వర్యంలో మే 6, 2023 న మేరీల్యాండ్ లో జరిగిన అంతర్జాతీయ మాతృ దినోత్సవం (మదర్స్ డే) వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ అవనిలో దేవుడు ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. అందులో అనిర్వచనీయమైన, అవధులు లేని, అపురూపమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది ఒక అమ్మ ప్రేమ మాత్రమే.

విచ్చేసిన మాతృమూర్తులందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జ్యోతి ప్రజ్వలన తో ఈ వేడుకలను ప్రారంభించారు. దాదాపుగా 600 మంది ఈ Women Empowerment Telugu Association కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధి గా మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణ మిల్లర్ తన మాతృమూర్తి మరియు 2 కౌన్సిల్‌మెన్ హాజరైయ్యారు.

వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మాతృమూర్తుల ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు తెలుగు ప్రవాస మహిళలను ఉత్తేజపరిచాయి. DMV లోకల్ ఆర్గనైజషన్స్ కాట్స్ (CATS) కార్యవర్గ ప్రెసిడెంట్ సతీష్ వడ్డి, ఫౌండర్ రామ్ మోహన్ రెడ్డి కొండా, జనరల్ సెక్రటరీ పార్థ బైరెడ్డి మరియు వారి ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఉజ్జ్వల ఫౌండేషన్ ప్రెసిడెంట్ అనిత, DMV లోకల్ లీడర్ శ్రీధర్ నాగిరెడ్డి మరియు శ్రీలేఖ పల్లె విచ్చేశారు. WETA స్థాపకురాలు ఝాన్సీ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు పురస్కారాలు అందజేసిన అనంతరం ప్రసంగిస్తూ WETA సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి WETA అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను వివరించారు.

ప్లే బ్యాక్ సింగర్ విజయలక్ష్మి (Singer Vijayalakshmi) తన మధురమైన గానంతో ప్రేక్షకులకు ఆనందాన్ని అందించారు. యాంకర్ శ్రావ్య మానస (Sravya Manasa) తన వాక్చాతుర్యంతో అందరితో ఆడుతు పాడుతు కార్యక్రమాన్ని ఎంతో రక్తి కట్టించారు. వీటితో పాటుగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు మరియు టాలీవుడ్, బాలీవుడ్ డ్యాన్స్‌తో కూడిన ఈవెంట్ అనేక గేమ్స్ మరియు రాఫెల్స్ కి గిఫ్ట్స్ అందిస్తూ భారీ విజయాన్ని సాధించింది. రుచికరమైన ఆహారాన్ని అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected