Connect with us

Women

WETA @ Maryland: దిగ్విజయంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవం నిర్వహణ

Published

on

ప్రాంతాలకు మతాలకు, రాజకీయాలకు అతీతమైన లాభాపేక్షలేని WETA ఆధ్వర్యంలో “అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని డీసీ/మేరీల్యాండ్ (Maryland) ఏరియాలోని ఫ్రెడెరిక్స్ లోఉన్న “ఓక్డేల్ మిడిల్ స్కూల్” ప్రాంగణంలో మే 18 న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన “రీనె నాప్” సిటీ కౌన్సిల్ మేరీల్యాండ్ కీలకోపన్యాసం చేశారు.

ఈ కార్యక్రమంలో “వైసీల బ్రేవో”( ఫ్రెడెరిక్స్ కౌంటీ కమ్యూనిటీ లియేషన్), WETA వ్యవస్థాపకురాలు ఝాన్సీ రెడ్డి, ప్రెసిడెంట్ శైలజ కల్లూరి, మేరీల్యాండ్ WETA – BOD ప్రీతి రెడ్డి, టెక్సస్-BOD ప్రతిమ రెడ్డి, DMV కల్చరల్ చైర్ చైతన్య పోలోజు, రీజినల్ కోఆర్డినేటర్ స్వరూప సింగరాజు, మీడియా చైర్ సుగుణ రెడ్డి మరియు ఇతర ప్రముఖ సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి శ్రావ్య మానస (Shravya Manasa) వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అతిథి వక్తలు “అమ్మ” అనే పదంలోనే షరతులు లేని కరుణ, ప్రేమ, ధైర్యం, దయ ఇమిడి ఉంటుంది అని, ప్రస్తుత సందర్భంలో మరియు సమాజంలో మహిళల పాత్రపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సమాజ సేవకు గాను “రీనె నాప్” “వైసీల బ్రేవో” లకు ఆదర్శప్రాయమైన సేవా పురస్కారాలు (Service Awards) అందించబడ్డాయి.

జీవితంలోని అన్ని కష్టాల నుండి మనల్ని కాపాడే రక్షణ కవచం లాంటిది తల్లి అని ఝాన్సీరెడ్డి అన్నారు. ఆమె విద్యార్ధులను శక్తివంతం చేయడానికి మరియు స్త్రీ యొక్క స్థితిని పెంపొందించడానికి మరియు ఎల్లప్పుడూ తల్లులకు తగిన గౌరవం ఇవ్వడానికి వారిని ప్రేరేపించింది. సాంకేతికత, వైద్యం, కళలు, ఇంజినీరింగ్ మరియు మరెన్నో ప్రాతినిధ్యాలు లేని రంగాలలో బాలికలు మరియు మహిళల అభివృద్ధికి మార్గాలను సృష్టించే ఉద్దేశ్యంతో మా చర్యలు నిర్వహించబడుతున్నాయి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం మరియు స్పాన్సర్ చేయడం అనే దృష్టితో WETA కృషి చేస్తుంది.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మదర్స్ డే (Mother’s Day) ఈవెంట్ స్థానిక నృత్య మరియు సంగీత పాఠశాలల నుండి సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ఉత్తేజకరమైన లాటరీ బహుమతులతో వినోదభరితమైన కార్యకలాపాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది DC ఏరియా నివాసితులు మరియు మేరీల్యాండ్ సభ్యులు పాల్గొన్నారు. తల్లులందరినీ సత్కరించేందుకు మరియు అభినందించడానికి అనేక ప్రదర్శనలు ప్లాన్ చేయబడ్డాయి.

విద్యార్థులు తమ తల్లులకు తమ అభిమానాన్ని చాటుకునేందుకు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.చిన్నారులు, యువతీ యువకుల నాట్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకొన్నాయి. ప్రముఖ తెలుగు (Tollywood) ప్లేబాక్ సింగర్ అంజనా సౌమ్య (Anjana Sowmya) పాటలతో ప్రేక్షకులను పాటలతో హుషారు నింపి హోరెత్తించారు.

“తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట’ అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే “మహిళ సాధికారతే “లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ అనే సంస్థను 2019 లో ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. WETA యొక్క ముఖ్య లక్ష్యాలు స్త్రీలకు సరైన నైపుణ్యాలను అందించడం, సాధికారత, శక్తినివ్వడం మరియు జ్ఞానోదయం చేయడం, తద్వారా వారు సమాజానికి సానుకూల సహకారం అందించడం.

మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తుంది. WETA (Women Empowerment Telugu Association) స్థానిక ప్రభుత్వాల సహకారంతో మరియు ఇతర లాభాపేక్షలేని మరియు స్వచ్ఛంద సంస్థలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మద్దతునిచ్చాయి.

ఈ సారి మరింత వైభవంగా “మాతృ దినోత్సవం” ఆర్గనైజ్‌ చేసినందుకు ప్రెసిడెంట్ శైలజ కల్లూరి (Sailaja Kalluri) గారు లోకల్ WETA టీం మేరీల్యాండ్ WETA -BOD ప్రీతి రెడ్డి, టెక్సస్ – BOD ప్రతిమ రెడ్డి, DMV కల్చరల్ చైర్ చైతన్య పోలోజు, రీజినల్ కోఆర్డినేటర్ స్వరూప సింగరాజు, మీడియా చైర్ సుగుణ రెడ్డి మరియు వాలంటీర్స్ “గురుచరణ్ చిట్నా, “మోహన్ పులిచర్ల” లకు ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు.

అలాగే Maryland లోకల్ స్పాన్సర్స్ “భాస్కర్ గంటి”, “అరుణ్ ఎరువ”, “చంద్ర” కి మొమెంటో లను బహుకరిస్తూ వారి సహాయ సహకారాలను కొనియాడారు. ఈసారి పెద్ద ఎత్తున హై స్కూల్ మరియు యువ వాలంటీర్స్ (Volunteers) ఉత్సహాంగా పాల్గొని ఈ వేడుక (Mother’s Day) దిగ్విజయమవడనికి దోహద పడ్డారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected