Connect with us

Women

మహిళా వికలాంగుల సదనంలో 30 వీల్ ఛైర్లను అందించిన ప్రియాంక వల్లేపల్లి @ Champapet, Hyderabad

Published

on

ఈరోజు హైదరాబాదు (Hyderabad) లో చంపాపేట్ లోని ప్రభుత్వ మహిళా వికలాంగుల సదనంలో 30 వీల్ ఛైర్లను (Wheelchairs) దివ్యాంగుల మహిళలకు క్వాలిటీ మాట్రిక్స్ సంస్థ ప్రతినిధి శ్రీమతి ప్రియాంక వల్లేపల్లి (Priyanka Vallepalli) అందజేశారు.

వికలాంగులకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సుమారుగా రెండు లక్షలు రూపాయల ఖర్చుపెట్టి దివ్యాంగ మహిళలకు వీల్ ఛైర్లను అందజేసిన ప్రియాంక వల్లేపల్లి (Priyanka Vallepalli) ని స్థానిక కార్పొరేటర్, బిజెపి (Bharatiya Janata Party – BJP) రాష్ట్ర నాయకులు వంగ మసూద్ రెడ్డి సత్కరించి అభినందించారు.

అఖిలభారత వికలాంగులకు ప్రతినిధి కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అమెరికాలో ఉండి ఉన్నత స్థానానికి ఎదిగి పుట్టిన ప్రాంతానికి సేవ చేయడం అదృష్టమని అందులో ప్రియాంక వల్లేపల్లి మరియు వారి భర్త శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ముఖ్యంగా దివ్యాంగులకు చేయడం చాలా సంతోషమని అన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected