ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ప్రతియేటా క్రిస్మస్ పండుగ సందర్బంగా వివిధ రాష్ట్రాలలో టాయ్స్ మరియు బ్లాంకెట్స్ డ్రైవ్ నిర్వహించి షెల్టర్ హోమ్స్ (Shelter Homes) లో వున్న స్త్రీ లకు మరియు పిల్లలకు డొనేట్ చేయడం తెలిసిన విషయమే.
ఈ సంవత్సరం కూడా కాలిఫోర్నియా (California) మరియు టెక్సస్ (Texas) రాష్ట్రాలలో టాయ్స్ మరియు బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. క్రిస్మస్ (Christmas) సందర్భంగా ఆ పిల్లల ముఖాల్లో సంతోషం, ఆనందం చూడడం జరిగింది.
WETA ఫౌండర్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు మరియు ప్రెసిడెంట్ శైలజ కల్లూరి ఆధ్వర్యంలో కాలిఫోర్నియా లో శాక్రమెంటో (Sacramento) లోని షెల్టర్ హోం లో WETA టీం సభ్యులు రత్నమాల, విశ్వ, పూజ, రేఖ, హైమ, అనురాధ, జ్యోతి, చందన సుధ, సునీత పంపిణీ చేశారు.
అలాగే టెక్సస్ స్టేట్ లో డల్లాస్ (Dallas) నగరంలో Good Samaritan షెల్టర్ హోం లో WETA (Women Empowerment Telugu Association) టీం సభ్యులు స్మృతి, ప్రతిమ, ప్రశాంతి మరియు చిన్నారులు సుదీప, సంహిత పంపిణీ చేశారు.