Connect with us

Women

600 మంది ఆహుతులతో మేరీల్యాండ్ లో ‘వేటా’ మదర్స్ డే సెలబ్రేషన్స్ విజయవంతం

Published

on

తెలుగు మహిళల కోట స్త్రీ ప్రగతి పథమే బాట అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే మహిళ సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) అనే సంస్థను రెండు సంవత్సరాల క్రింద ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేశారు.

మహిళలకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను పెంచి వారి కలలను సాకారం చేసూకోవడానికి ఈ సంస్థ తోడ్పడాలనే ఉద్దేశంతో ఝాన్సీరెడ్డి ఈ సంఘం స్థాపించారు. మహిళా నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తుంది.

ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్ విజయవంతంగా ముగిశాయి. మే 16 న మేరీల్యాండ్ హానోవర్ లో నిర్వహించిన సెలబ్రేషన్స్ కి దాదాపు 600 మందికి పైగా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వేటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి గారి ఆధ్వ‌ర్యంలో వేటా మేరీల్యాండ్ చాప్టర్ కార్య‌వ‌ర్గం మ‌ద‌ర్స్ డే ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ప్ర‌ముఖ లోకల్ బ్యాండ్ తమ సుమ‌ధుర గీతాల ఆలాపనతో అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.

వివిధ పోటీల‌లో విజేత‌లుగా నిలిచిన మహిళలకు బ‌హుమ‌తులను అంద‌జేశారు. అలాగే ఆహుతులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వేటా మీడియా నేషనల్ ఛైర్పర్సన్ సుగుణ రెడ్డి మరియు స్థానిక వేటా టీం ప్రీతీ రెడ్డి, యామిని రెడ్డి, నవ్యస్మృతి, జయ పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని దిగ్విజ‌యం చేసిన వేటా స్థానిక కార్య‌వ‌ర్గాన్ని ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు అభినందించారు. ఇంకా స్థానిక కమ్యూనిటీ లీడర్స్ సుధా కొండపు, కవిత చల్ల, శ్రీధర్ నాగిరెడ్డి, డా. పల్లవి, రామ్మోహన్ కొండా, యోయో టీవీ నరసింహ రెడ్డి, అనిత ముత్తోజు, అపర్ణ కడారి మొదలగు వారు పాల్గొన్నారు. యాంకర్ మరియు సింగర్ మధు నెక్కంటి అందరిని తన మాటల గారడితో మంత్రముగ్ధులని చేసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected