Connect with us

Women

600 మంది ఆడపడుచుల మధ్య వైభవంగా వేటా మహిళా దినోత్సవ వేడుకలు @ Dallas, Texas

Published

on

అమెరికాలోని డల్లాస్ నగరంలో విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) అధ్వర్యం లో మార్చి 12న అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డల్లాస్ లో రుచి ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలలో ఆరు వందలకు పైగా తెలుగు ఆడపడుచులు మరియు చిన్నారులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన తో ఉత్సాహంగా ప్రారంభం అయిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా “కారోల్టన్ డిప్యూటీ మేయర్ నాన్సీ క్లైన్” విచ్చేసారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు తెలుగు ప్రవాస మహిళలను ఉత్తేజపరిచాయి.

WETA వ్యవస్థాపకురాలు ఝాన్సీ (Jhansi Reddy) గారు మాట్లాడుతూ.. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః”. స్త్రీలను గౌరవంగా చూసే చోట దేవతలు ఉంటారని, ఎక్కడ స్త్రీలను చిన్నచూపు చూస్తారో అక్కడ చేసిన పనులు వ్యర్థమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

డిప్యూటీ సిటీ మేయర్ నాన్సీ క్లైన్ ముఖ్య అతిథి మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి మహిళలు చేస్తున్న సేవలను అభినందించారు. ఈ వేటా కార్యక్రమంలో Dr. సుమనా గంగి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.

WETA స్థాపకురాలు ఝాన్సీ గారు ఈ కార్యక్రమంలో ఫల్గున్న అతిధులకు పురస్కారాలు అందజేసిన అనంతరం ప్రసంగిస్తూ WETA సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి WETA అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను వివరించారు.

యాంకర్ మధు నెక్కంటి (Madhu Nekkanti) గారు తన వాక్చాతుర్యంతో అందరితో ఆడుతు పాడుతు కార్యక్రమాన్ని ఎంతో రక్తి కట్టించారు. వీటితో పాటుగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు మరియు టాలీవుడ్, బాలీవుడ్ డ్యాన్స్‌తో కూడిన ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది. రుచికరమైన ఆహారాన్ని అందించారు.

ముఖ్యంగా మెహర్ చంటి (Mehar Chanti) గారి లైవ్ బ్యాండ్ (MLive Band) వారు చేసిన సంగీత విభావరి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. మహిళలు చేసిన సంప్రదాయ వస్త్రాలతో చేసిన ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికి హైలైట్ అని చెప్పవచ్చు. WETA వ్యవస్థాపకురాలు ఝాన్సీ గారు సమక్షంలో అధ్యక్షురాలు శైలజ రెడ్డి (Sailaja Reddy Kalluri) గారు మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా సంస్థకు కృషి చేస్తే ఎంతో మంది మహిళలకు సేవ చేయగలం అని తెలిపారు.

పిదప అతిథి ఉపన్యాసకులు సంధ్య గవ్వ, శ్రీనివాస్ కవిత ఆకుల, సుమన గంగి, స్వాతి నేలభట్ల, నాగిని కొండేల, డా.శ్రీనివాస్ రెడ్డిలకు ఆహ్వానం మన్నించి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డల్లాస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నవ్య స్మృతి, ప్రతిమారెడ్డి లకు, మరియు కోర్ టీమ్ అనురాధ, హైమ అనుమాండ్ల, జయశ్రీ తేలుకుంట్ల, ప్రత్యూష నర్రపరాజు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు, వాలంటీర్స్కు కృతజ్ఞతలు తెలిపారు.

చివరిగా ఈ కార్యక్రమానికి సహాయం అందించిన స్పాన్సర్లకి, మీడియా మిత్రులకు, ఆహ్వానితులకు అందరికీ Women Empowerment Telugu Association (WETA) నాయకత్వం ధన్యవాదాలు తెలిపి ‘వేటా’ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected