Connect with us

Associations

శ్రీనివాస్ అబ్బూరి అధ్యక్షునిగా వాషింగ్టన్ తెలుగు సమితి నూతన కార్యవర్గం: WATS

Published

on

వాషింగ్టన్ తెలుగు సమితి 2022 సంవత్సరానికి గాను బోర్డు పాలక వర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షునిగా అబ్బూరి శ్రీనివాస్ జనవరి 1 నుంచి ఛార్జ్ తీసుకుంటారు. ఈ సందర్భంగా ఎన్నారై2ఎన్నారై.కామ్ తరపున అబ్బూరి శ్రీనివాస్ కు అభినందనలు. ప్రస్తుత సంవత్సరం 2021 మరియు 2020 లో వైస్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్న శ్రీనివాస్, 2019 లో ప్రధాన కార్యదర్శిగా, 2018 లో సాంస్కృతిక కార్యదర్శిగా, 2017 లో వెబ్ మాస్టర్ గా వాషింగ్టన్ తెలుగు సమితి బోర్డులో పలు సేవలందించారు.

అలాగే దొడ్డా జయపాల్ రెడ్డి (ఉపాధ్యక్షులు), కొత్తపల్లి సునీత (ప్రధాన కార్యదర్శి), గూడవల్లి రాజేష్ (కోశాధికారి), రెడ్డి మధు (సాంస్కృతిక కార్యదర్శి), కొండూరు ప్రకాష్ (సాహిత్య కార్యదర్శి) మరియు తమ్మినేని రామ్ (వెబ్ మాస్టర్) వాషింగ్టన్ తెలుగు సమితి నూతన కార్యవర్గంలో బాధ్యతలు చేపట్టేవారిలో ఉన్నారు. స్నేహితులు, వాట్స్ సభ్యులు 2022 నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected