గ్రేటర్ సియాటిల్ (Seattle, Washington) ప్రాంతంలోని తెలుగు ప్రజలను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చేలా వాషింగ్టన్ తెలుగు సమితి (Washington Telugu Samithi – WATS) ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు దేశభక్తిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సంక్రాంతి పండుగకు (Sankranthi Festival) ప్రత్యేకమైన సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
సాంస్కృతిక ప్రదర్శనలు, ముగ్గుల పోటీ (Rangoli Competition), పిల్లల ఫ్యాన్సీ డ్రెస్సు, బొమ్మల కొలువు, భోగి పళ్ళు (Bhogi Pallu) వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే పండుగ వాతావరణానికి మరింత వైభవాన్ని చేకూర్చుతూ సంక్రాంతి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.
కుటుంబ సహితంగా జరిగిన ఈ వేడుకల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతలో తెలుగు సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రవాస తెలుగు (Telugu) సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.
ఈ సందర్భంగా వాషింగ్టన్ తెలుగు సమితి (Washington Telugu Samithi – WATS) అధ్యక్షులు మధు రెడ్డి (Madhu Reddi) గారు, కార్యవర్గం తరఫున కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిథులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్య అతిథులుగా హాజరైన భారత కాన్సులేట్ జనరల్ (Consul General of India), సియాటిల్ నుండి శ్రీ సౌమిత్ రాజు కంచనపల్లి గారు, అలాగే బోథెల్ సిటీ కౌన్సిల్ సభ్యులు శ్రీ ప్రసాద్ అంగులూరి గారు వారి సహకారం, ప్రోత్సాహానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే వాషింగ్టన్ తెలుగు సమితి (Washington Telugu Samithi – WATS) గత అధ్యక్షులైన శ్రీ వంశీ రెడ్డి కంచరకుంట్ల గారు, శ్రీ షకీల్ భాషా పొగాకు గారు, శ్రీ జయపాల్ రెడ్డి దొడ్డా గారు, శ్రీ రామ్ పాలూరి గారు, శ్రీ శ్రీనివాస్ అబ్బూరి గారు, శ్రీ రాజేష్ గుడవల్లి (Rajesh Gudavalli) గారు తదితరులకు వారి మార్గదర్శకత్వం, నిరంతర సహకారానికి అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమ విజయానికి తోడ్పడిన సమాజ నాయకులు, వాలంటీర్లు, సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రవాస ప్రాంతాల్లో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందుకు తీసుకెళ్లడంలో వాషింగ్టన్ తెలుగు సమితి (Washington Telugu Samithi – WATS) కీలక పాత్ర పోషిస్తూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.
కార్యక్రమ వివరాలు
కార్యక్రమం: సంక్రాంతి & గణతంత్ర దినోత్సవ వేడుకలు
తేదీ: ఫిబ్రవరి 1, 2026
సమయం: మధ్యాహ్నం 2:00 గంటల నుండి
వేదిక: జువానిటా హై స్కూల్
10601 NE 132nd St, కిర్క్ల్యాండ్, వాషింగ్టన్ – 98034
వాషింగ్టన్ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులు
మధు రెడ్డి – అధ్యక్షులు
ప్రకాశ్ కొండూరు – ఉపాధ్యక్షులు
రామ్ తమ్మినేని – ప్రధాన కార్యదర్శి
హరిని దేశరాజు – ఖజానాదారు
శివ వేడూరుపర్తి – సాంస్కృతిక కార్యదర్శి
శ్రీరామ్ పాటిబండ్ల – సాహిత్య కార్యదర్శి
కృష్ణ కోటపాటి – వెబ్ మాస్టర్