Connect with us

News

Nara Lokesh యువగళం ముగింపు, వాషింగ్టన్ డీసీ ప్రవాసుల అభినందనలు

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన చారిత్రిక యువగళం (Yuvagalam) పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎన్నారైలు, తెలుగుదేశం, జనసేన (Janasena) పార్టీ అభిమానులు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వేదికగా ఆయనకు అభినందనలు తెలిపారు.

యువతకు ప్రాతినిధ్యం వహిస్తూ, రాష్ట్ర సమస్యలపై గల మెత్తి, ఈ ఏడాది జనవరి 27న రాయలసీమ కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర నేడు ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలోని అగనంపూడి వరకు అడుగడుగునా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల నీరాజనాలతో దిగ్విజయంగా సాగిందని.. ప్రజల సమస్యలను అర్ధం చేసుకుంటూ, ప్రత్యక్షంగా చూస్తూ, యువ నాయకుడిగా నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం జనగళమై, నవయువ శకానికి నాంది అంటూ అభిప్రాయపడ్డారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని, ప్రజాస్వామ్య విలువలు మరచి జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ప్రభుత్వం లోకేష్ యువగళం పాదయాత్ర చుట్టూ పలు అడ్డంకులు సృష్టించి, తండ్రి నారా చంద్రబాబు నాయుడు ని అక్రమ అరెస్ట్ చేసినా కూడా, చెక్కు చెదరని ఉక్కు సంకల్పంతో, ప్రజామోదంతో సాగిన ఈ యాత్ర చరిత్ర సృష్టించిందని, అంతిమంగా ఈరోజు ముగింపు సభ.. రాబోతున్న ఆంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శంఖారావమని.. చంద్రబాబు (Nara Chandrababu Naidu) నాయకత్వం చారిత్రక అవసరమని ప్రకటించారు.

ఈ అభినందన కార్యక్రమంలో వాషింగ్టన్ డీసీ (Washington DC) వాసులు సతీష్ వేమన (Satish Vemana), విజయ్ గుడిసేవ, భాను మాగులూరి, నాగ్ నెల్లూరి, యాష్ బొద్దులూరి, మురళీధర్ గౌడ్, సుధీర్ కొమ్మి, రవి అడుసుమిల్లి, భాను వలేటి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected