Connect with us

Associations

Lake Lanier Islands, Atlanta: సరదాగా సాగిన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ 1996 – 2000 బ్యాచ్ రజతోత్సవ సమ్మేళనం

Published

on

Lake Lanier Islands, Atlanta: అమెరికా లో Lake Lanier Islands లో VRSEC 1996 -2000 బ్యాచ్ వాళ్ళు రజతోత్సవ సమ్మేళనం సెప్టెంబర్ 19 – 21 వరకు జరుపుకున్నారు. దాదాపు 70 మంది అమెరికాలో నలుమూలల నుంచే కాకుండా, వివిధ దేశాల నుంచి కూడా విచ్చేసారు. ఈ వేడుకను చూస్తుంటే, అదొక ఈవెంట్ లా కాకుండా, తిరిగి కాలేజీ రోజుల్లోకి వెళ్లినట్లు, ఒక పండుగ లాగా అనిపించింది.

మూడు రోజుల ఈ Reunion లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు:

• శుక్రవారం, సెప్టెంబర్ 19: “ది గేమ్ ఛేంజర్” వద్ద కలుసుకున్న Alumni, ఆ తర్వాత Lake Houses హౌస్‌లలో అర్ధరాత్రి దాటినా కబుర్లు చెప్పుకుంటూ పాత జ్ఞాపకాల్లో మునిగిపోయారు. వచ్చిన classmates అందరికి, 12 Lake Houses లో, ఆడవారికి, మగవారికి వేరు వేరు గా వసతి ఏర్పాటు చెయ్యటం జరిగింది. అంతే కాకుండా, ఒకొక్క Lake House కి, ఒకొక్క గోల్ఫ్ కార్ట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది.

• శనివారం, సెప్టెంబర్ 20: వచ్చిన అతిధులు ఉదయం గోల్ఫ్ కార్ట్‌లలో ఐలాండ్ మొత్తం తిరుగుతూ, పికిల్‌బాల్ ఆడుతూ, హైకింగ్ చేస్తూ సరదాగా గడిపారు. లైవ్ దోస స్టాల్‌తో బ్రంచ్ ఆస్వాదించారు. ఆ తర్వాత అందరూ ఒకేలాంటి టీ-షర్టులు వేసుకుని గ్రూప్ ఫోటో దిగారు.

సాయంత్రం గ్రాండ్ బాల్‌రూమ్‌లో జరిగిన సంబరాలు ఈ వేడుకకే హైలైట్ గ నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ఈవెంట్ ప్రారంభమైంది. పద్మజ తటవర్తి భరతనాట్యం, నీరజ జొన్నలగడ్డ కథక్ నృత్యాలతో స్టేజ్ పై అదరగొట్టారు. లేడీస్ గ్రూప్ చేసిన తెలుగు మెడ్లీ డ్యాన్స్, ‘సమరసింహా రెడ్డి’ మూవీ ట్రైలర్ స్కిట్, శ్రీకాంత్ తుమ్మూ చేసిన “బోటనీ పాటముంది” డాన్స్ వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా, దివంగతులయిన బ్యాచ్ మేట్స్ సునీల్ అడ్డల, ప్రశాంతి, మరియు అరవింద్ చిల్లరపు లకు నివాళులు అర్పించారు. కొంతసేపు మౌనం పాటించి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ రీయూనియన్ కి హాజరు కాలేని వాళ్ళు కూడా తమ వీడియో సందేశాలను పంపి ఈ వేడుకలో పరోక్షంగా పాలుపంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి VRSEC వైస్ ఛాన్సలర్ Prof. Paruchuri Venkateswar Rao గారు జూమ్ కాల్ లో వచ్చి, బ్యాచ్‌ను అభినందించారు. అదే విధంగా VRSEC డీమ్డ్ యూనివర్సిటీ గా అయ్యింది అని, అయినప్పటికీ స్టూడెంట్స్ సంఖ్య పెంచకుండా, వారి నాణ్యత, నైపుణ్యం మీద దృష్టి సారించితున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా అక్కడకి వచ్చిన Alumni కాలేజీ గురించి శ్రద్దగా తెలుసు కొని, మునుముందు కాలేజీకి ఎలా సపోర్ట్ చెయ్యాలి అని అడిగి తెలుసు కున్నారు.

భారతదేశం నుంచి వచ్చిన Sridhar Paladugu, Chakravarthi Chukkapalli, Anitha Verma, Bommaraju Venkata Janakiram (UK), and Suma Boddu (Canada) వంటి దేశాల నుండి వచ్చిన పూర్వ విద్యార్థులు రీయూనియన్ కేక్ కటింగ్ చేసారు. చివరగా, డిజె మ్యూజిక్‌తో డాన్స్ ఫ్లోర్ సందడిగా మారింది. 90ల హిట్ సాంగ్స్‌కు Alumni ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

వీడ్కోలు బ్రేక్‌ఫాస్ట్‌తో ఈ వేడుక ముగిసింది. మళ్ళీ కలుసుకునే వాగ్దానంతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని, జ్ఞాపకాలతో తమ ప్రయాణాలను మొదలుపెట్టారు. “25 ఏళ్లు గడిచిందంటే నమ్మలేకపోతున్నాం. రాంప్ వాక్, ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకోవడం, నవ్వుకోవడం.. ఇవన్నీ కాలేజీ రోజులను గుర్తు చేశాయి.

ఈ Reunion కేవలం కలుసుకోవడం మాత్రమే కాదు, మా అందరి బంధాన్ని, VRSEC తో ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పింది,” అని Alumni పంచుకున్నారు. పూర్తిగా Alumni చే నిర్వహించబడిన ఈ రజతోత్సవ Reunion, VRSEC Alumni బంధం ఎంత బలమైందో చూపించింది. ఈవెంట్ విజయవంతం కావడానికి అలుపెరగని కృషి చేసిన నిర్వాహక కమిటీ సభ్యులు: Srihari Atluri, Ashalatha Vemuganti, Uppen Chava, Anil Yarlagadda, Phaneendra Kadiyala, Srinivas Challagundla, Sudhakar Reddy Alla, Padmaja Karri, Gudavalli Rajesh, Anuja Rama, Gopi Manne, and Suneel Thottempudi.

error: NRI2NRI.COM copyright content is protected