ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ఎమ్ఎల్‌ఏ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు (విశాఖ దక్షిణ) కాలిఫోర్నియ (California) రాష్ఠ పర్యటనలో బాగంగా, శ్రీధర్ వెరోస్ (Sridhar Verose), కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్ రామన్ నగర ఉప మేయర్‌తో నగర హాల్‌లో సమావేశమయ్యారు.
విధాన విభాగం, నగర మౌలిక సదుపాయాలు, నగర రోడ్లు, పార్కులు మరియు గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధి మరియు నిర్వహణ, శుద్ధమైన నీటి సరఫరా, విద్య వంటి వివిధ విషయాలపై విశాఖ దక్షిణ ఎమ్ఎల్‌ఏ చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ చర్చించారు.
అలాగే భవిష్యత్తు ప్రాజెక్టుల్లో సాన్ రామన్ (City of San Ramon, California) నగరంతో కలిసి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh, India) రాష్టం ఎలా పనిచేయాలో చర్చించారు.