తెలంగాణ (Telangana) లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడి మాతృదేశంపై ప్రేమతో, సొంత గ్రామం పై ఉన్న మమకారంతో, తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాల పై ఉన్న అభిమానంతో ఆటా ప్రతినిధి జంబుల విలాస్ రెడ్డి (Vilas Reddy Jambula) మంచాల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సుగంధ మేడం గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విలాస్ రెడ్డి జంబుల గారు… మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఈరోజు అమెరికాలో మంచి ఉద్యోగం లో స్థిరపడ్డానని అన్నారు.
మీరు కూడా బాగా చదువుకోవాలని మంచి స్థాయిలో ఉండాలని నా వంతు సహకారం మరియు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association – ATA) ఆధ్వర్యంలో ఎప్పుడు మీ పాఠశాలకి సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.
ఇప్పుడు ఉన్న ఐదు తరగతులకు నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని కావున ఒక వాలంటీర్ కు సంబంధించి సంవత్సరానికి సరిపడా డబ్బులు అందిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అశ్వాల బాలరాజు గారు ఉపాధ్యాయులు రుబియాన, దివ్య, సాయికుమార్, యాదయ్య, గీత తదితరులు పాల్గొన్నారు
విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ… చాలామంది సేవ చేయడానికి గవర్నమెంట్ స్కూల్ కి తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి అమెరికాలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో మరియు ఇతర ఫ్రెండ్స్ సహకారంతో ఈ కార్యక్రమం జరపడం జరిగింది.
అదేవిధంగా అమెరికా వాస్తవ్యులైన సంతోష్ రెడ్డి కోరం, ప్రదీప్ కట్ట, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల తర్వాత ఇతర మిత్రుల బృందంతో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 2024 జూన్ 7 8 9 తేదీలలో అమెరికాలో అట్లాంటా (Atlanta) నగరంలో ఆట మహాసభలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మహాసభలకు తెలుగు రాష్ట్రాల అన్ని రంగాల ప్రముఖులు హాజరవుతారని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆటావేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa) మరియు ఆటా వేడుకల చైర్మన్ వేణు సంకినేని, ఆటా సెక్రటరీ రామకృష్ణారెడ్డి ఆల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18 వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రెటరీ రవీందర్ గూడూరు, మీడియా కోఆర్డినేటర్ ఈశ్వర్ బండ, పాస్ట్ ప్రెసిడెంట్ కర్ణాకర్ మాధవరం, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు నరసింహారెడ్డి ధ్యాసాని, కాశీ కొత్త, రఘువీర్ మరిపెద్ది, రఘువీర్ రెడ్డి, శరత్ వేముల, శ్రీకాంత్ రెడ్డి గుడిపాటి, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కోఆర్డినేటర్ అమృతములపూడి సినీ నటుడు & కల్చరల్ అడ్వైజరి లోహిత్, కోఆర్డినేటర్ శశికాంత్, మీడియా కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, అదే విధంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ న్యూ జెర్సీ రీజినల్ అడ్వైజరి విలాస్ రెడ్డి జంబుల తదితరులు పాల్గొన్నారు.