Connect with us

News

Brunei, Island of Borneo: భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం

Published

on

Brunei, Island of Borneo, Asia: భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగు (Viksit Bharath Run) ను తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్ (Taman Mahkota Jubli Emas), ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు.

వికసిత్ భారత్ (Viksit Bharath) 2047 దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.

ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత (India) రాయబారి శ్రీ రాము అబ్బగాని గారు మాట్లాడుతూ, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక, “దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి” అని పేర్కొన్నారు.

ఈ గౌరవప్రదమైన కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం (Brunei Telugu Association) సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. వారు నిరంతరం భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని మరియు ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఘనవిజయవంతం కాగా, వికసిత్ భారత్ దిశగా బ్రూనై (Brunei, Island of Borneo) లోని భారతీయ సమాజం యొక్క భాగస్వామ్య భావనను ప్రతినిధ్యం వహించింది.

error: NRI2NRI.COM copyright content is protected