అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ కి సంబంధించి వెస్ట్ కోస్ట్ లో ప్రముఖంగా వినిపించే పేరు విజయ్ రెడ్డి తూపల్లి. ప్రస్తుత (2021-24) బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గా సేవలందిస్తున్న విజయ్ (Vijay Reddy Thupally) గత 15 సంవత్సరాలుగా ఆటా లో మరియు పలు ఇతర సంస్థల్లో నాయకత్వ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు.
2012 లో అట్లాంటా లో నిర్వహించిన ఆటా కన్వెన్షన్ (ATA Convention) కి కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్ కోచైర్ గా, లాస్ ఏంజెల్స్ రీజినల్ కోఆర్డినేటర్ గా, వెస్ట్ కోస్ట్ రీజినల్ డైరెక్టర్ గా, 2020 లో లాస్ ఏంజెల్స్ (Los Angeles) లో కోవిడ్-19 కారణంగా రద్దయిన ఆటా కన్వెన్షన్ కి కాన్ఫరెన్స్ కోకన్వీనర్ గా కూడా సక్రమంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.
కాలిఫోర్నియా (California) ప్రాంతంలో ఆటా పేరు ప్రముఖంగా వినిపించేలా చేయడంలో ముఖ్యపాత్ర వహించిన విజయ్ రెడ్డి తూపల్లి వివిధ ఫండ్రైజింగ్ కార్యక్రమాలు, విమెన్ ఎంపవర్మెంట్, డిజాస్టర్ రిలీఫ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన కమ్యూనిటీ కార్యక్రమాలు (Community Service Activities) నిర్వహించి తన సత్తా చాటారు.
ఆటా (American Telugu Association – ATA) లో ఆర్ధిక పారదర్శకత, సంస్థాగత నిర్వహణ, ఆర్ధిక స్థిరత్వం, యూత్ ఎంగేజ్మెంట్, అమెరికన్ నాన్ ప్రాఫిట్స్ తో సత్సంబంధాల ఏర్పాటు వంటి దూరదృష్టితో మంచి విజన్ కలిగి ఉండడం అభినందనీయం. ఆటా పట్ల చిత్తశుద్ధితో వెస్ట్ కోస్ట్ లోని కాలిఫోర్నియా ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోవడం విశేషం.
లెట్స్ కంటిన్యూ బిల్డింగ్ ఆ స్ట్రాంగర్ ఆటా అంటూ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) లో 2025-28 కాలానికి సంబంధించి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ పదవికి పోటీ చేస్తున్నారు. లైఫ్ కేటగిరీ (Life Members Category) లో ప్రస్తుత బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గా సేవలందిస్తున్న విజయ్ తనను తిరిగి ఎన్నుకోవలసిందిగా ఆటా సభ్యులను వినమ్రంగా కోరుతున్నారు.
డిసెంబర్ 2న పోస్ట్ ద్వారా పంపిన బాలట్స్ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్లను చేరుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేవారం డెలివరీ అవుతాయి. అందరూ విజయ్ (Vijay Reddy Thupally) కి వోట్ వేసి డిసెంబర్ 20వ తేదీ లోపు ఆటా (American Telugu Association – ATA) కి అందేలా తిరిగి మెయిల్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు.