. 1999 నుండి ఇప్పటి వరకు సుమారు $750,000 సొంత నిధుల దానం
. కన్వెన్షన్ ఏ సంస్ఠదైనా ఉదారంగా దాహార్తి తీర్చేది విద్యాధర్ గారపాటి నే
. 20 సంవత్సరాలుగా వ్యాపారంలో రాణింపు
. దాతృత్వం మరియు సేవే పరమార్ధంగా ఔదార్యం
. తానా క్యాన్సర్ క్యాంపుల బాహుబలిగా గుర్తింపు
. కోవిడ్ సమయంలో తెలుగు రాష్ట్రాలకు విస్తృత సేవలు
. అమెరికాలో విద్యార్థుల కొరకు శాట్, యాక్ట్ కోచింగ్ నిర్వహణ
. తానా ఫౌండేషన్ ట్రస్టీగా సేవలకు దక్కిన గుర్తింపు కార్యదర్శి పదవి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తానా ఫౌండేషన్ 2023-25 కాలానికి కార్యదర్శిగా న్యూ జెర్సీ వాసి విద్యాధర్ గారపాటి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దాతృత్వం మరియు సేవే తన జీవితానికి పరమార్ధం అంటున్న విద్యాధర్ గారపాటి గురించి మీ కోసం NRI2NRI.COM ప్రత్యేక కథనం.
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు కి చెందిన విద్యాధర్ గారపాటి గత 25 సంవత్సరాల నుండి న్యూ జెర్సీ లో స్థిరపడ్డారు. మూవర్స్.కామ్ మరియు ఎన్ జిఏ గ్రూప్ సంస్థల అధినేతగా గత 20 సంవత్సరాలుగా రాణిస్తున్న విద్యాధర్, 1999 నుండి ఇప్పటి వరకు సుమారు $750,000 సొంత నిధులు వివిధ సేవాకార్యక్రమాల కోసం దానం చేశారు.
ఒక చేయి చేసిన దానం రెండో చేయికి తెలియకూడదనేలా ఇటు తానా నే కాకుండా అటు అమెరికాలోని పలు లాభాపేక్షలేని సంస్థలకు తన ఔదార్యాన్ని చాటారు. ఇండియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తానా మరియు గ్రేస్ ఫౌండేషన్ ద్వారా ఒక సాధారణ వాలంటీర్ మాదిరి చేసిన సేవలు వెలకట్టలేనివి.
ఇక కోవిడ్ లో ప్రపంచమంతా విలవిలలాడుతున్న సమయంలో $10,000 ఖర్చుతో హైదరాబాద్ లోని నిర్మాణ రంగ కూలీలకు ఆహారం మరియు బేసిక్ సప్లైస్, అలాగే $1,250,000 విలువ చేసే 180 ఆక్సిజన్ సిలిండర్లు అందించి తన దాతృత్వాన్ని చాటారు.
కన్వెన్షన్ ఏ సంస్ఠదైనా ఉదారంగా దాహార్తి తీర్చేది మాత్రం విద్యాధర్ గారపాటి
- 2014 లో అట్లాంటాలో నిర్వహించిన నాటా కన్వెన్షన్ కి 14 వేల డాలర్ల విలువ చేసే 40 వేల మంచినీళ్ల బాటిల్స్ విరాళం
- 2014 లో డెట్రాయిట్లో నిర్వహించిన తానా కన్వెన్షన్ కి 14 వేల డాలర్ల విలువ చేసే 60 వేల మంచినీళ్ల బాటిల్స్ విరాళం
- 2019 లో వాషింగ్టన్ డీసీ లో నిర్వహించిన తానా కన్వెన్షన్ కి 25 వేల డాలర్ల విలువ చేసే 70 వేల మంచినీళ్ల బాటిల్స్ విరాళం
- 2022 లో న్యూ జెర్సీ లో నిర్వహించిన టిటిఎ కన్వెన్షన్ కి 10 వేల డాలర్ల విలువ చేసే 20 వేల మంచినీళ్ల బాటిల్స్ విరాళం
- 2022 లో వాషింగ్టన్ డీసీ లో నిర్వహించిన ఆటా కన్వెన్షన్ కి 50 వేల డాలర్ల విలువ చేసే 110 వేల మంచినీళ్ల బాటిల్స్ విరాళం
- 2023 లో న్యూ జెర్సీ లో నిర్వహించిన నాట్స్ కన్వెన్షన్ కి 10 వేల డాలర్ల విలువ చేసే 20 వేల మంచినీళ్ల బాటిల్స్ విరాళం
- 2023 లో ఫిలడెల్ఫియాలో నిర్వహించిన తానా కన్వెన్షన్ కి 35 వేల డాలర్ల విలువ చేసే 70 వేల మంచినీళ్ల బాటిల్స్ విరాళం
సేవాకార్యక్రమాలలో సింహ భాగం తానా ద్వారానే
- 2014 లో తానా పత్రికకు 5 వేల డాలర్ల విరాళం
- 2017 లో సెయింట్ లూయిస్ లో నిర్వహించిన తానా కన్వెన్షన్ కి 10 వేల డాలర్ల విరాళం
- 2017 లో కాలిఫోర్నియా లోని బే ఏరియాలో నిర్వహించిన తానా సాంస్కృతిక కార్యక్రమాల కోసం 10 వేల డాలర్ల విరాళం
- 2017 లో ఫిలడెల్ఫియాలో నిర్వహించిన తానా రీజినల్ కన్వెన్షన్ కి 4.5 వేల డాలర్ల విరాళం
- 2019 లో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తానా ఈవెంట్స్ కి 25 వేల డాలర్ల విరాళం
- 2019 లో ధీం-తానా పోటీల నిర్వహణకు 10 వేల డాలర్ల ఖర్చు
తానా ఫౌండేషన్ పై ప్రత్యేక మమకారం
- 5 వేల సభ్యత్వ రుసుముతో తానా ఫౌండేషన్ డోనార్ మెంబర్ గా ప్రారంభం
- 2016 లో తానా ఫౌండేషన్ ‘మన ఊరి కోసం’ అంటూ 17 నగరాల్లో నిర్వహించిన 5కే రన్ కొరకు 15 వేల డాలర్ల విరాళం
- 2019 తానా కన్వెన్షన్ లో కపిల్ దేవ్ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ ని 25 వేల డాలర్లకు సొంతం చేసుకోవడం ద్వారా తానా ఫౌండేషన్ కి ఫండ్స్ అందించారు.
- స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ద్వారా తానా ఫౌండేషన్ సేవాకార్యక్రమాలను విస్తృతం చేసేలా లక్ష డాలర్ల నిధుల సమీకరణ
- గత 2 సంవత్సరాలుగా తానా ఫౌండేషన్ ట్రస్టీ గా సేవల ఉధృతం
- గ్రేస్ ఫౌండేషన్ మరియు బసవతారకం ఆసుపత్రి సహకారంతో 100కి పైగా తానా క్యాన్సర్ క్యాంపుల నిర్వహణ
మాతృభూమి ఇండియాలో
- 2007 లోనే ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలకు 35 వేల డాలర్ల విలువైన ఉపకరణాల దానం
- హైదరాబాద్ లో క్యాన్సర్ అవగాహన కోసం నిర్వహించిన రన్ లో 10 వేల మందికి పైగా పాల్గొనేలా కీలకపాత్ర పోషించడమే కాకుండా 5 వేల డాలర్ల విరాళం
- 2022 లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన 150 కి పైగా క్యాన్సర్ పరీక్షల శిబిరాలకు లక్ష డాలర్ల విరాళం
- గత తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో భాగంగా పేదలకు సుమారు 10 వేల డాలర్ల విలువ చేసే దుప్పట్ల పంపిణీ
- 100 కి పైగా క్యాన్సర్ పరీక్షల శిబిరాల ద్వారా 25 వేల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన అభాగ్యులకు సహాయం
మెట్టినింట అమెరికాలో
- హైస్కూల్ విద్యార్థుల కొరకు శాట్, యాక్ట్ శిక్షణా తరగతులు నిర్వహించి, తద్వారా తానా ఫౌండేషన్ కి లక్ష డాలర్ల నిధుల సమీకరణలో కీలక పాత్ర
- న్యూ జెర్సీ లోని సౌత్ బ్రూన్స్విక్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ కి 17వేల డాలర్ల విలువ చేసే చెస్ట్ కంప్రెషన్ సిస్టం అందేలా సాయం
- నిధుల సమీకరణ, 5కే రన్, వలంటీరింగ్, సలహాదారు ఇలా అనేక విధాలుగా సమాజంలో అందరితో మమేకమవడం