Connect with us

News

NRI TDP రాయలసీమ స్పోక్స్ పర్సన్ గా వేణుగోపాల్ రెడ్డి చెంచు నియామకం

Published

on

ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) వివిధ విభాగాలను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమైంది. దీనిలో భాగంగా ఎన్నారై‌ తెదేపా యూఎస్ఏ (NRI TDP USA) సెయింట్ లూయిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా ఉన్న గాలివీడు మండలానికి చెందిన వేణు గోపాల్ రెడ్డి చెంచు ని (Venugopal Reddy Chenchu) రాయలసీమ టీడీపి పార్టీ స్పోక్ పర్సన్ గా నిమించినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Venugopal Reddy Chenchu

ఈ సందర్భంగా వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, చంద్రబాబును మళ్లీ సీఎంని చేయడంమే లక్ష్యమన్నారు. ప్రజా సమస్యల మీద, ఆర్ధిక, రాజకీయ, సామజిక, అంశాల మీద, అవగాహన పెంచుకోవటానికి, పార్టీ యొక్క సిద్దాంతాలను, లక్ష్యాలను, విది విధానాలను ప్రజలలోకి తీసుకువెళతానని అన్నారు. కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడి, ప్రజల కష్టాలు, అవసరాలు తెల్సుకొని, వారకి నిత్యం అందుబాటులో వుండి, పార్టీ పైన ప్రజలకి నమ్మకం కల్గించి, దాన్ని ఓటు రూపంలో మార్చి, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ని విజయ తీరాలకు చేర్చాలని అన్నారు.

స్పోక్ పర్సన్ (Spokesperson) గా నియమించినందుకు పార్టీ అధినాయకత్వం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కు, టీడీపి జాతీయ కార్యదర్శి నారాలోకేష్ (Nara Lokesh) కు, ఎన్నారై టీడీపీ ప్రతినిధులు జయరాం కోమటి, సతీష్ వేమన లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్అర్ఐ టీడీపీ యూఎస్ఏ రాయలసీమ మీడియా అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా చెంచు వేణు గోపాల్ రెడ్డి కి పలువురు టీడీపి నాయకులు అభినందనలు తెలియజేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected