Connect with us

Community Service

Gudivada: వెంకట రమణ యార్లగడ్డ దాతృత్వంతో దొండపాడులో Free Mega Eye Camp విజయవంతం

Published

on

ఉయ్యూరు రోటరీ కంటి ఆసుపత్రి (Rotary Eye Hospital) వారు తానా ఫౌండేషన్ మాజీ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ దాతృత్వంతో గుడివాడ (Gudivada) మండలం, దొండపాడు గ్రామంలో గత ఆదివారం మే 25న ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.

దాదాపు 300 మంది గుడివాడ (Gudivada) చుట్టుపక్కల గ్రామస్తులు ఈ సేవలను వినియోగించుకున్నారు. వీరిలో 60 మందికి శుక్లాల ఆపరేషన్, 98 మందికి కళ్లద్దాల అవసరం ఉందని గుర్తించారు. వీరందరికీ వెంకట రమణ యార్లగడ్డ ఉచితంగా ఆపరేషన్లు, కంటి అద్దాలు సమకూర్చనున్నారు.

ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ (TANA Foundation) మాజీ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మాట్లాడుతూ… ఈ ఉచిత వైద్య కంటి శిబిర (Free Mega Eye Camp) సేవలను వినియోగించుకున్న గ్రామస్తులను, సహకరించిన ఉయ్యూరు రోటరీ కంటి ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు.

దొండపాడు లోని స్థానిక కల్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ కంటి శిబిరాన్ని నిర్వహించారు. దాతృత్వ హృదయంతో ఈ ఉచిత వైద్య కంటి శిబిర సేవలకు కారకులైన తానా (TANA) ఫౌండేషన్ మాజీ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ (Venkata Ramana Yarlagadda) ని అందరూ అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected