Connect with us

News

తానా సభల అడ్వైజరీ కమిటీ సభ్యునిగా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ నియామకం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ‘తానా’ 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ తానా (TANA) మహాసభల కోసం 70 కి పైగా కమిటీలు ఏర్పాటుచేశారు. ఇందులో ముఖ్యమైన అడ్వైజరీ కమిటీ (Advisory Committee) లో సభ్యునిగా ప్రస్తుత తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ని నియమించారు. తానా ఫౌండేషన్ తరపున ఈ టర్మ్ లో వెంకట రమణ యార్లగడ్డ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

తానా (Telugu Association of North America) లో పలు బాధ్యతలు విజయవంతంగా నిర్వహించిన వెంకట రమణ యార్లగడ్డ తన అనుభవాన్నంతటిని రంగరించి తగిన సూచనలు, సలహాలతో తానా 23వ మహాసభల (23rd TANA Conference) విజయవంతానికి ఉపయోగపడతారని తానా సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా తానా నాయకులు, సభ్యులు అందరూ వెంకట రమణ యార్లగడ్డ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 4 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ తానా (TANA) మహాసభల అడ్వైజరీ కమిటీలో ఇంకా గౌతం రెడ్డి గోలి, పురుషోత్తం చౌదరి గుడే, మహేందర్ రెడ్డి ముసుకు మరియు లక్ష్మి దేవినేని కూడా ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected