ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమంలో భాగంగా గుంటూరు (Guntur, Andhra Pradesh) జిల్లా పుల్లడిగుంటలో అక్టోబర్ 8వ తేదీన 50 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉపకార వేతనాలు (Scholarships) పంపిణీ చేశారు.
దాదాపు 5 లక్షల రూపాయల విలువైన ఈ స్కాలర్ షిప్ లను వెంకట్ జిల్లెళ్లమూడి (Venkat Jillellamudi) స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లను పంపిణీ చేసే అవకాశం ఇచ్చినందుకు తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli), అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, కో ఆర్డినేటర్ శ్రీకాంత్ పోలవరపులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఉప్పుటూరి చినరాములు పర్యవేక్షించగా, బండి నాగేశ్వరరావు విజయవంతానికి కృషి చేశారు. ఉపకార వేతనాలు (Scholarships) అందుకున్న విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లితండ్రులు తానా నాయకులకు (TANA Leaders) మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.