Connect with us

Singing

వేగేశ్న – SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్, TTA, NYTTA ల ఆధ్వర్యంలో పాటల పల్లకి @ New York

Published

on

వేగేశ్న సంస్థ తో జతకూడి SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ (SPBMI), న్యూ యార్క్ లోని సోదర తెలుగు సంస్థలు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మరియు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (NYTTA) ల సహకారం తో జూన్ 15న జరిగిన పాటల పల్లకి కార్యక్రమం, మానవత-సంగీతం-ప్రతిభలను (Charity, Music, Excellence) కలబోసి, గౌరవించుకుంటూ జరిగిన ఈ త్రివేణి సంగమం అద్భుతంగా, రసరమ్యంగా, విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమం లో బిరుదుకు తగ్గట్టుగా వివిధ భాషలలొ చక్కని పాటలు వినిపించి ప్రేక్షకులను అలరించారు గానకళా సార్వభౌమ యనమండ్ర  రామకృష్ణ గారు, వారి సతీమణి లలితా రామకృష్ణ గార్లు. వివిధ రంగాలలో విలక్షణ ప్రతిభ కనబరచిన న్యూయార్కు లోని ఆరుగురు విశిష్ట వ్యక్తులు/యువతని ఎంపిక చేసి శిరోమణి డాక్టర్ వంశీ రామరాజుగారి చేతులమీదుగా డా కె. విశ్వనాథ్-వంశీ ప్రతిభా పరస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ వంశీ రామరాజు గారిని వారి సేవలను గుర్తిస్తూ అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సార్వభౌమ బిరుదు తో సత్కరించారు.  Nassau County Dy. Director for Asian American Affairs, Mr. Meng Li, graced the occasion and handed over Citations on behalf of the County Executive Bruce Blakeman.

అవార్డ్ గ్రహీతలు

  • జయప్రకాష్ ఇంజపూరి – TLCA పాస్ట్ ప్రెసిడెంట్, 8 మారథాన్ లు, Kilimanjaro పర్వతారోహణ
  • ప్రణవ్ కౌశిక్  – సరిగమప లో గెలుపు, చిన్న వయసులోనే రచన, సంగీతం, చిత్ర దర్శకత్వం, నిర్మాణం
  • ప్రత్యూష గూడూరు – దశాబ్దం పైగా కమ్యూనిటీ సేవ, హార్వర్డ్ వాణిజ్య మహిళా నేతల సంఘం సభ్యురాలు, UNICEF NYC పాస్ట్ ప్రెసిడెంట్, న్యూయార్కు లాంగ్ ఐలాండ్ లో లయన్స్/లియో క్లబ్ సంస్థల వ్యవస్థాపకురాలు,
  • శబరి వనమ – దశాబ్దం పైగా కమ్యూనిటీకి నిర్విరామ సేవలు, పలు సంస్థలలో యూత్ చైర్
  • దివ్య దొమ్మరాజు –  తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA), న్యూయార్కు, లో మొట్టమొదటి రెండవతరం (Second Generation) క్రియాశీలక కార్యవర్గ సభ్యురాలు
  • హేమ వెంకట  –  న్యూయార్కు తెలంగాణా తెలుగు సంఘం (NYTTA), న్యూయార్కు, లో రెండవతరం (Second Generation) క్రియాశీలక కార్యవర్గ సభ్యురాలు.

డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy) గారు అందించిన ఉదార వితరణకు వేగేశ్న ఫౌండేషన్ (Vegesna Foundation) అధినేత వంశీ రామరాజు  కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే హాజరైన సంఘాలు, మిగతా ఆహూతులందరూ ఈ మానవతా కార్యక్రమానికి చలించిపోయి, స్పందించి అందించిన విరాళాలకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. 

TTA (Telangana American Telugu Association) రీజనల్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి గగ్గినపల్లి వేగేశ్న సంస్థ దివ్యాంగులకు చేస్తున్న సేవను కొనియాడారు.  NYTTA (New York Telangana Telugu Association) అధ్యక్షురాలు వాణి సింగిరికొండ గారు, అవార్డు గ్రహీతలను అభినందిస్తూ, యువత సంస్థల పగ్గాలు చేపడుతూ సంస్థలను కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకు వెళ్ళాలి అన్నారు.

SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీనివాస్ గూడూరు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని చేద్దాం అనగానే స్పందించి సహకారం అందించిన TTA, NYTTA సంస్థల అధినేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషిచేసి, క్షేత్రస్థాయిలో సహకరించిన ఇరు సంస్థల కార్యవర్గ సభ్యుల సేవలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

వ్యాఖ్యాతగా వ్యవహరించిన SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ వైస్ ఛైర్మన్ రాజీ బుర్ర గారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఒక కుటుంబ వాతావరణంలో ఆహ్లాదంగా జరిగింది అన్నారు. తాము స్వయంగా ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చిన వంటకాలతో కూడిన పసందైన విందు భోజనం అందించిన కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులను అభినందించారు.  ఆ విధంగా ఖర్చు తగ్గించి చేకూరిన ప్రతీ డాలరు చారిటీకి అందించగలిగాము అన్నారు.

ఈ కార్యక్రమానికి TTA, NYTTA ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సహోదర్ పెద్దిరెడ్డి, ఉషా మన్నెం, మల్లిక్ రెడ్డి, పవన్ రవ్వ, రమా వనమ లు, TTA పాస్ట్ కోశాధికారి రంజిత్ క్యాతం, రీజనల్ కో ఆర్డినేటర్ విజయేందర్ రెడ్డి బాస, NYTTA పాస్ట్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గడ్డం, సెక్రెటరీ రవిందర్ కోడెల, కార్యవర్గ సభ్యులు హారిక జంగం, తెలుగు సరస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary and Cultural AssociationTLCA) ప్రెసిడెంట్ కిరణ్ రెడ్డి పర్వతాల, పాస్ట్ ప్రెసిడెంట్ ఉదయ్ దొమ్మరాజు, వైస్ ప్రెసిడెంట్ సుమంత్ రామిశెట్టి, తానా (TANA) కో ఆర్డినేటర్ శిరీష తునుగుంట్ల, తానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ దీపికా సమ్మెట, శిరీష తునుగుంట్లలు హాజరు అయి అవార్డు గ్రహీతలను అభినందించారు. NYTTA కోశాధికారి హరిచరణ్ బొబ్బిలి వందన సమర్పణ చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected