Connect with us

Events

ఘనంగా Vasavi Seva Sangh సంక్రాంతి సంబరాలు @ Atlanta, Georgia

Published

on

వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) ఆధ్వర్యంలో అట్లాంటా (Atlanta) ప్రాంతంలో, కెల్లీ మిల్ పాఠశాల ఆవరణలో జనవరి 13 వ తారీఖున సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన పాటల కచేరి షో లో పలువురు ప్లే బ్యాక్ సింగర్లు పాటలు పాడి అలరించారు.

ప్రముఖంగా నూతన మోహన్ (పాడుతా తీయగా ఫేమ్) పాడిన పాటలకు ప్రేక్షకులు ఎంతోగా ఆనందించారు. అంతేకాకుండా నిర్వాహకులు 360 డిగ్రీస్ డిజిటల్ ఫోటో గ్రఫీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ముగ్గుల పోటీలు, డ్రాయింగ్ కంపిటీషన్స్ వంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించారు.

రకరకాల పిండి వంటలతో సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొని తెలుగు వారి సంస్కృతిని తెలియపరుస్తూ అమెరికా లోని అట్లాంటా ప్రాంతంలో సందడి చేసారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను www.NRI2NRI.com/Vasavi Seva Sangh Sankranthi Sambaralu 2024 లింక్ ద్వారా వీక్షించవచ్చు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected