Connect with us

News

Africa to America వందే విశ్వమాతరమ్: తానా & 100 దేశాల తెలుగు సంఘాల శ్రీకారం

Published

on

. నవంబర్ 9 నుంచి శ్రీనివాస్ చిగురుమళ్ళ 100 దేశాలలో శాంతి సద్భావనా యాత్ర
. రెండేళ్ల పాటు సాగనున్న సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య ప్రపంచ యాత్ర
. వంద దేశాలలోని వందకు పైగా తెలుగు సంఘాల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న మహా అక్షర యజ్ఞం
. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందే విశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళురి వెల్లడి
. బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర రావు తోటకూర ఆధ్వర్యంలో ఆఫ్రికా దేశాల యాత్రతో మొదలు
. 2025 లో అమెరికాలోని డెట్రాయిట్ లో ముగింపు
. కరపత్రం ఆవిష్కరణ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మరియు 100 దేశాల తెలుగు సంఘాల ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. నవంబర్ 9, 2023 వ తేదీన ఆఫ్రికా ఖండం లోని బోట్స్ వానా దేశంలో ఈ అపూర్వ యాత్ర ప్రారంభం అవుతుంది. 100 శతక పుస్తకాలు రచించిన శ్రీ శ్రీనివాస్ చిగురుమళ్ళ “వందే విశ్వమాతరమ్” పేరుతో 100 దేశాలలో శాంతి, సద్భావనా యాత్ర కు శ్రీకారం చుట్టారు.

ప్రపంచ సాహిత్య చరిత్రలో అపూర్వమైన ఘట్టంగా చెప్పదగిన ఈ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య యాత్ర తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగరపు, తానా పూర్వ అధ్యక్షులు, వందే విశ్వమాతరమ్ చైర్మన్ శ్రీ జయశేఖర్ తాళ్లూరి గారి ఆధ్వర్యంలో జరగడం అభినందనీయం. బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వర రావు గారి నేతృత్వంలో ఆఫ్రికా ఖండ దేశాలలో యాత్ర జరుగుతోంది.

ఈ చారిత్రాత్మకమైన ఘట్టంలో వందకు పైగా సభలు జరగడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వెలుగులు విరజిమ్ముతూ.. తెలుగు సాహిత్య పరిమళాలు వెదజల్లుతూ.. విశ్వశాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి రక్షణ, మానవీయ విలువలు వంటి బృహత్ లక్ష్యాలతో ఈ మహా యజ్ఞం సాగుతుంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected