Chicago, Illinois: చికాగో ఆడపడుచు, ప్రముఖ గాయని మాధురి పాటిబండ వచ్చిందమ్మా సంక్రాంతి (Sankranthi) అంటూ పాట పడుతూ స్వయంగా నర్తించింది. జనవరి 11 శనివారం రోజున ఈ పాట ఆదిత్య మ్యూజిక్ (Aditya Music) ద్వారా విడుదలై ప్రజాదరణ పొందుతుంది.
ఇప్పటి వరకు అమెరికాలో కన్వెన్షన్స్ మరియు మేజర్ ఈవెంట్స్ లో సింగర్ (Singer) గా రాణించిన మాధురి (Madhuri Patibanda), మొట్టమొదటిసారి స్వయంగా పాడి లీడ్ రోల్ లో నృత్యం చేస్తూ వీడియో సాంగ్ ద్వారా మన ముందుకు వచ్చింది. తోలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందరి మన్ననలు పొందుతుంది.
ఈ పాటకు నిహాల్ కొండూరి సంగీతాన్ని (Music), డా. కామేశ్వర్ దామరాజు లిరిక్స్, కార్తీక్ రెడ్డి అంబటి కొరియోగ్రఫీ, రాజమౌళి మరియు రాజు బన్నీ ప్రొడక్షన్, ఎవరెస్ట్ స్టూడియోస్ రికార్డింగ్ అందించగా, మాధురి పాటిబండ గాయనిగా మరియు లీడ్ రోల్ లో నృత్యం చేసి చక్కని సంక్రాంతి పండుగ సమయంలో ఆదిత్య మ్యూజిక్ (Aditya Music) ద్వారా విడుదల చేశారు.