హరికేన్ ఇయాన్ వాతావరణ పరిస్థితుల వల్లగ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ బతుకమ్మ, దసరా సంబరాలను అక్టోబర్ 2 ఆదివారానికి మార్చారు. వెన్యూ కూడా అందరికీ దగ్గిరగా ఆల్ఫారెటాలో ఇండోర్ వేదిక అయినటువంటి దేశాన పాఠశాలకు మార్చారు. కేవలం ఒక రోజు తేదీ మరియు వెన్యూ మాత్రమే మారింది. కానీముందస్తు ప్రణాళిక ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుండి అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున యధావిధిగా నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా ప్రముఖ జానపద గాయని మల్లిక స్వరం ఆహ్వానితులను అలరించనున్నారు.
సాఫ్ట్ పాత్ సిస్టం మరియు రెడ్డి సీపీఏ టైటిల్ స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్న ఈ గేట్స్ బతుకమ్మ, దసరా సంబరాలలో గ్రూప్, సింగిల్ మరియు టీన్ కేటగిరీస్ బతుకమ్మ పోటీలలో డైమండ్ రింగ్ మరియు కాష్ ప్రైజెస్ వంటి బంపర్ ప్రైజస్ ఇవ్వనున్నారు.
గౌరీ పూజ, జానపద పాటలు, నృత్యాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ భోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కావున బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆ మహాతల్లిని భక్తి శ్రద్ధలతో సేవిద్దాం రండి అంటున్నారు సునీల్ గోటూర్ ఆధ్వర్యంలోని గేట్స్ 2022 కార్యవర్గం.