Connect with us

Education

WASC గుర్తింపు పొందిన సిలికానాంధ్ర యూనివర్సిటీ

Published

on

2016 లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్ నగరంలో స్థాపించబడిన సిలికానాంధ్ర యూనివర్సిటీ Western Association of Schools and Colleges (WASC) గుర్తింపు పొందింది. భారతీయులచే నెలకొల్పబడిన ప్రప్రథమ యూనివర్సిటీకి గుర్తింపు రావడం విశేషం. స్టాన్ ఫోర్డ్ లాంటి ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలకి కూడా ఈ గుర్తింపు ఉంది.

2017లో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించడంతో భారతీయ భాషలు, కళల్లో బోధన ప్రారంభమయ్యింది. ప్రస్తుతం సిలికానాంధ్ర యూనివర్సిటీలో కూచిపూడి నాట్యం, భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు మరియు సంస్కృత భాషా విభాగాలలో డిప్లొమా నుండి మాస్టర్స్ డిగ్రీల వరకు బోధన జరుగుతుంది.

ఈ సందర్భంగా సిలికానాంధ్ర యూనివర్సిటీ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ భారతీయ భాషలకు, కళలకు అంతర్జాతీయ స్థాయిలో పట్టంగట్టి, ప్రతిభగల విద్యార్థులకు బోధన చేయటానికి ఈ గుర్తింపు తోడ్పడుతుందని అన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆచార్య వేణుగోపాల్రావు పప్పు మాట్లాడుతూ ఈ గుర్తింపు మరిన్ని భారతీయ కళలు, భాషలు, ఆయా రంగాల్లో పరిశోధనలు చేయటానికి సహకరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ప్రొవోస్ట్, చీఫ్ అకడెమిక్ ఆఫీసర్ రాజు చమర్తి మాట్లాడుతూ సిలికానాంధ్ర యూనివర్సిటీలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందని చెప్పటానికి ఈ గుర్తింపు తొలిమెట్టు అన్నారు. యూనివర్సిటీ ఆర్థిక, పరిపాలనా విభాగం ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ WASC గుర్తింపు యూనివర్సిటీ అభివృద్ధికి ఎన్నో బాటలు వేస్తుందన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected