Frisco, Texas: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం TANTEX (Telugu Association of North Texas) వనితా వేదిక ఆధ్వర్యంలో “United in Wellness – Celebrating Women in Our Community” అనే థీమ్‌తో మహిళల ఆరోగ్య మరియు యోగ కార్యక్రమం ఫ్రిస్కోలోని The10YEC – Youth Excellence Center లో విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యోగ సెషన్ (Yoga Session) నిర్వహించడంతో పాటు ప్రముఖ వైద్య నిపుణులు డా. యమున గుర్రపు మరియు డా. సురేఖ మాచుపల్లి మహిళల ఆరోగ్యం, నివారణ వైద్యం, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణ మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి విలువైన సూచనలు అందించారు.
పాల్గొన్న మహిళలు ఆసక్తిగా చర్చలో పాల్గొని అనేక ఆరోగ్య సూచనలు తెలుసుకున్నారు. టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి (Madhavi Lokireddy) మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం సమాజ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని, ఇటువంటి కార్యక్రమాలు మహిళల్లో ఆరోగ్య అవగాహనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని టాంటెక్స్ (Telugu Association of North Texas – TANTEX) వనితా వేదిక చైర్ దీపికా పేట ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వైద్య నిపుణులు, స్పాన్సర్లు, వాలంటీర్లు మరియు సమాజ సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా PIN Clothing Drive కూడా నిర్వహించబడింది. ఇందులో భాగంగా సారీస్, లెహంగాలు మరియు జ్యువెలరీ వంటి ఉపయోగించిన వస్తువులను సేకరించి సేవా కార్యక్రమాలకు (Service Activities) అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
టాంటెక్స్ (Telugu Association of North Texas – TANTEX) నాయకత్వం భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడే ఆరోగ్య, సేవా మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు తమ కట్టుబాటును వ్యక్తం చేసింది.