Connect with us

Arts

ఎడిసన్ నగర సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్ కాస్థల – New Jersey

Published

on

అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రజలు అత్యధికంగా నివసించే నగరమైన న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగర సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్ కుమార్ కాస్థల నియమితులయ్యారు. ఉజ్వల్ గత పదేళ్లుగా ఎడిసన్ నగరంలో నివసిస్తూ ప్రవాస భారతీయ సంఘాల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. పరాయిదేశంలో మన తెలుగువానికి ఈ పదవి దక్కడం ఆనందదాయకం.

న్యూ జెర్సీ రాష్ట్రంలో ఐదవ పెద్ద నగరమైన ఎడిషన్ నగర జనాభా లక్షకు పైగా ఉంటే అందులో దాదాపు 30 శాతం భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. లిటిల్ ఇండియాగా పిలవబడే ఓక్ ట్రీ రోడ్ ఎడిసన్ నగరంలోనే ఉంది. 2022 జనవరిలో జరిగిన మేయర్ ఎన్నికలలో మొదటిసారి భారత సంతతి కి చెందిన సామ్ జోషి ఎడిసన్ నగర మేయర్ గా ఎన్నికయ్యారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected