అట్లాంటా తెలుగు సంఘం (TAMA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న అట్లాంటా లోని డెన్మార్క్ హై స్కూల్లో నిర్వహించిన శ్రీ క్రోధినామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలు (Ugadi Utsavalu) విందు వినోదాల ఉల్లాస ఉత్సహాలతో ఘనంగా జరిగినవి. ఈ ఉగాది ఉత్సవాలకు సంప్రదాయ వస్త్రధారణతో 2000 మందికి పైగా ప్రజలు హాజరై తెలుగుతనం ఉట్టిపడేలాగా జరుపుకున్నారు.
ఈ ఉగాది ఉత్సవాలకు ప్లాటినం స్పాన్సర్లుగా హాట్ బ్రెడ్స్ (Hot Breads), గోల్డ్ స్పాన్సర్స్ గా, శేఖర్ రియాల్టీ, (Sekhars Realty) నార్త్ ఈస్ట్ మార్ట్ గేజ్ (Northeast mortgage), స్ప్లాష్ బి ఐ (SplashBI), అప్ 2 డేట్ టెక్నాలజీస్ (Up2Date technologies), రెడ్డిక్స్ లెండింగ్ (Reddix Lending), అట్లాంటా హైడ్రేషన్స్ (Atlanta Hydrations) వ్యవహరించారు.
అలాగే సిల్వర్ స్పాన్సర్స్ గా వేళా లైఫ్ ప్లాన్ (Vela Life Plan), విషి & వీకి (Vishi & Vikhy), అమృత్ ఆయుర్వేద (Amruth Ayurveda), భూమి రియాల్టీ (Bhoomi Realty), స్మైల్ అండ్ షైన్ డెంటల్ (Smile and shine Dental), విపిర్ రియాల్టీ (VPR Realty, Murali Sunkara) గరుడ వేగా (Garuda Vega) బ్రాంజ్ స్పాన్సర్స్ గా సన్ లైట్ టెక్నాలజీస్ (Sunlight Technologies), శ్రీ లక్కీ ఫైనాన్సియల్ గ్రూప్ (Sri Lucky Financial Group) సహాయం అందించారు.
ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యశ్వంత్ జొన్నలగడ్డ మరియు రోబోథింక్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ సాకర్ బాట్ పోటీలు (Robotics Soccer Competition) నిర్వహించగా 60 మంది పిల్లలు, చిత్రకళలను కృష్ణ ఇనపకుతిక ఆధ్వర్యంలో 120 మంది పిల్లలు హాజరయ్యారు.
అలాగే మినీ మొక్ టేస్ట్ ను థింక్ టేల్స్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో 60 మంది పిల్లలు మరియు డిజిటల్ ఏజ్ పేరెంటింగ్ వర్కుషాప్ (Digital Age Parenting Workshop) ను గ్లోబల్ అకాడమీ నేతృత్వంలో నిర్వహించగా 50 కి పైగా పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ పాఠవాలను చాటారు.
శశి దగ్గుల, శ్రీనివాసులు రామిశెట్టి పర్యవేక్షణలో వివిధ రకాల వ్యాపారులు ఏర్పాటు చేసిన ముప్ఫైపైగా స్టాల్స్ లో ప్రత్యేక ఆహార పదార్ధాలు, ఆభరణాలు, వస్త్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పండితులు రవి శర్మ గారు ఉగాది పంచాంగ శ్రవణం గావించగా, తమ తమ రాశిఫలాల వివరాలను సభలోని వారందరూ శ్రద్ధగా ఆలకించారు.
ఉగాది ఉత్సవాలను ముందుగా తామా సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరపల్లి (Suneel Devarapalli) జ్యోతి ప్రజ్వలన చేయుటకు అందరిని వేదిక పైకి ఆహ్వానించారు. తర్వాత కార్యక్రమంలో సురేష్ బండారు (Suresh Bandaru) కార్యవర్గ మరియు బోర్డ్ సభ్యులను ఆహుతులకు పరిచయం చేశారు.
అనంతరం తామా అధ్యక్షులు సురేష్ బండారు… మాట్లాడుతూ ఏ దేశమేగినా ఎందుకాలిడినా సాంప్రదాయాలను విడనాడని గడ్డ నుంచి వచ్చినవారే తెలుగువారిని పేర్కొంటూ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు.
అలాగే తామా బోర్డు (TAMA Board) చైర్మన్ శ్రీనివాసరావు ఉప్పు (Srinivas Uppu) మాట్లాడుతూ… ఉగాది పండుగంటే తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభ వేడుకని పండుగ ప్రాశస్త్యాన్ని మరియు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని దాని ఆవశ్యకతను వివరించారు.
అమెరికాలో స్థిరపడిన తెలుగు వారంతా సాంస్కృతిక ప్రదర్శనలు అందించి చిన్నారులు, మహిళలు మరియు పురుషులు తమ ప్రతిభ పాటలను ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తెలుగు గాయకులు కారుణ్య (Tollywood Singer Karunya) మరియు మాళవిక (Playback Singer Malavika) ఆలపించిన పాటలు ఉర్రూతలూగించాయి.
పాటలకు చిన్నారులు, మహిళలు పురుషులతో పాటు పెద్దలు సైతం నృత్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రము లోని ప్రఖ్యాత హస్తకళల కేంద్రమైన బొబ్బిలి నుంచి కళాకారుల స్వహస్తాలతో తయారు చేయబడిన బొబ్బిలి వీణలను ప్రత్యేకంగా తెప్పించి తామా (TAMA) వారు స్పాన్సర్లకు అందజేయటం ఎంతో విశేషం.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన కాన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియా (Consul General of India, Atlanta) శ్రీ రమేష్ బాబు గారిని మరియు డిస్ట్రిక్ట్ 4 కమీషనర్ (District 4 Commissioner) సిండీ జోన్స్ మిల్స్ ను శాలువాతో పాటు పుష్పగుచ్చాలు అందించి మరియు బొబ్బిలి వీణలను బహుకరించి ఘనంగా సత్కరించారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ… తామా (Telugu Association of Metro Atlanta) తెలుగు పండుగలను భావితరాలకు పరిచయం చేసేలా జరుపుకుంటూ ముందుకు సాగుతుండటం అభినందనీయమన్నారు. సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు (Cultural Programs) ఆకట్టుకున్నాయి.
ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే ఈసారి కూడా బంతి భోజనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందమందికి పైగా వాలంటీర్లు (Volunteers) పాల్గోని ఒక్కో బంతికి 250 మంది చొప్పున 8 బంతులకు ఆప్యాయంగా విస్తరాకులలో వడ్డించడం జరిగింది. ఇంత మందికి భోజన ఏర్పాట్లు చేసిన తామా వారిని అందరూ ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగు రాష్ట్రాల (Telugu States) నుండి తెప్పించిన మామిడి తాండ్ర, పాలకోవా, మాడుగుల హల్వా, పండు మిరపకాయ కొత్తిమీర పచ్చడి, ఆవకాయ, నువ్వుల కారం, పప్పుల పొడి, వడియాలు, చల్ల మిరపకాయలు ఇంకా నోరూరించే వంటకాలతో పాటు షడ్రుచుల ఉగాది పచ్చడి వచ్చిన అతిథులందరూ ఆస్వాదించారు.
ఈ కార్యక్రమంలో TAMA కార్యవర్గ మరియు బోర్డ్ సభ్యులు శ్రీనివాస్ ఉప్పు, సురేష్ బండారు, చలమయ్య బచ్చు, ప్రియాంక గడ్డం, రాఘవ తడవర్తి, సునీత పొట్నూరు, ప్రవీణ్ బొప్పన, రవి కల్లి, ఇన్నయ్య ఎనుముల, యశ్వంత్ జొన్నలగడ్డ, సుమ పోతిని, వెంకట శివ గోక్వాడ, కృష్ణ ఇనపకుతిక, పవన్ దేవులపల్లి, నగేష్ దొడ్డాక, తిరు చిల్లపల్లి, శశి దగ్గుల, శ్రీనివాసులు రామిశెట్టి, రూపేంద్ర వేములపల్లి, సునీల్ దేవరపల్లి, సత్య నాగేందర్ గుత్తుల, మధు యార్లగడ్డ పాల్గొన్నారు.
చివరిగా ఉగాది ఉత్సవాలను అత్యద్భుతంగా విజయవంతం చేసిన అట్లాంటా తెలుగు ప్రజలకి, స్పాన్సర్స్ కి, రుచికరమైన విందు భోజనాలను అందించిన హాట్ బ్రెడ్స్ యాజమాన్యానికి, వాలంటీర్స్ కి, కళాకారులకి మరియు ప్రేక్షకులందరికీ సభాముఖంగా తామా ఉపాధ్యక్షుడు రూపేంద్ర వేములపల్లి (Rupendra Vemulapalli) ధన్యవాదాలు తెలిపి ద్విగ్విజయంగా ముగించారు.
మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/ Telugu Association of Metro Atlanta TAMA Ugadi 2024 in Atlanta Georgia ని సందర్శించండి.