Connect with us

Concert

వినోదం విజ్ఞానం మేళవించిన TAGB ఉగాది ఉత్సవాలు @ Boston, Massachusetts

Published

on

ఏప్రిల్ 7, 2024 ఉదయం ఎష్లాండ్ హైస్కూల్ ప్రాంగణం TAGB ఉగాది ఉత్సవాలకై ఎంచక్కా ముస్తాబై కళకళలాడింది. బోస్టన్ (Boston) పరిసర ప్రాంతాల తెలుగు సంఘం నిరాఘాటంగా నిర్వహించిన దాదాపు 10 గంటల ఈ ఉత్సవాలకి, దాదాపు 1000 మంది పైగా హాజరుకాగా, రకరకాల అంగడులు, కమ్మటి ఫలహారాలు పిల్లల సందడులతో ప్రాంగణం కళకళ లాడింది.

శ్రీ కూచిపూడి నాట్యాలయ బృందం శ్రీమతి శైలజ తుమ్మల ఆధ్వర్యంలో చేసిన “మన పండుగలు” నృత్య రూపకం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. దాదాపు 60 మంది బృందంతో మన తెలుగు రాష్ట్రాల పండుగలను ఎంతో ఉత్సాహంతో ఆహుతులముందు ఆవిష్కరించారు Sri Kuchipudi Natyalaya వారు. ఉగాది సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.

బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొని, సాంప్రదాయ- సినీ పాటలు, నృత్యాలు, నాటికలు వంటి వైవిధ్య భరితమైన వినూత్న కార్యక్రమాలు ప్రదర్శించారు. వీనులవిందుగా శాస్త్రీయ సంగీతం, కన్నుల విందుగా నృత్యం, మరెన్నోవైవిధ్యమైన సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు, చిన్నారులు చేసిన ఇంకెన్నో ఉత్సాహ భరితమైన, ఉత్తేజ పూరితమైన సినీ నాట్యాలు ప్రేక్షకులని ఉర్రుతలూగించాయి.

వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమం అని ఆహుతులు మెచ్చుకున్నారు. వచ్చిన వారిని టి.ఏ.జి.బి కార్యవర్గం ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం, లడ్డూ లతో సాదరంగా ఆహ్వనించింది. టి.ఏ.జి.బి కార్యవర్గం మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Telugu Association of Greater Boston (TAGB) తెలుగు వాకిలి తోరణం వద్ద కార్యక్రమాలనో పాలు పంచుకున్న పిల్లలకి, వారిని ప్రోత్సహిస్తున్న గురువులకి, తల్లి తండ్రులకి మా మాతృభాషాభివందనములు. టి.ఏ.జి.బి అధ్యక్షురాలు శ్రీమతి దీప్తీ గోరా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీమతి దీప్తీ గోరా, ప్రెసిడెంట్-ఎలెక్ట్ శ్రీనివాస్ గొంది, కార్యదర్శి శ్రీకాంత్ గోమఠం, కోశాధికారి దీప్తి కొరిపల్లి, సాంస్కృతిక కార్యదర్శి జగదీష్ చిన్నం లను పరిచయం చేసారు. బోర్ద్ చైర్మన్ శ్రీ కృష్ణా మాజేటీ బోర్డ్ సభ్యులు శ్రీయితులు అంకినీడు రవి, శేషగిరి రెడ్డీ, పద్మావతి భిమ్మన మరియు పద్మజా బాలా లను పరిచయం చేసారు.

ఎం లైవ్ బాండ్ (MLive Band) వారి ఆధ్వర్యంలో కారుణ్య మాళావిక సంగీత విభావరి ఆహుతలను ఉర్రూతలూగించింది. మెడ్రాస్ గ్రిల్ వారి ఉపహారాలు, విందు భోజనం పసందుగా రుచిగా అందరి మెప్పు పొందింది. వేదికను చక్కగా అలంకరించిన S & R Events కు మరియు చక్కటి ఆడియో సపోర్ట్ అందించిన SRAVEO కు ధన్యవాదాలు తెలిపారు.

స్పాన్సర్స్ TEAM AID, Key Prime Realty, SterlingSmiles, Patel Brothers, SmartKids, NewYork Life, Citi Air, Paradise Biryani Pointe కు కృతజ్ఞతలు తెలిపారు. ఈవెంట్ స్పొన్సార్స్ Classic Events – Moksha Jewelers మరియు స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected