Boston, Massachusetts: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (Telugu Association of Greater Boston) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13, 2025న Mechanics Hall, Worcester, MA లో ఉగాది మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 1400 మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.
హాల్‌ను Sparkling Party Rentals బృందం అందంగా అలంకరించి అందరిని ఆకట్టుకుంది. విచ్చేసిన అతిథులను సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడి, పానకాలతో Telugu Association of Greater Boston (TAGB) ఆదరంగా ఆహ్వానించింది. కార్యక్రమాన్ని TAGB అధ్యక్షుడు శ్రీనివాస్ గొంది, ఎన్నికైన అధ్యక్షురాలు సుధ మూల్పూరు, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, భండారి జగదీశ్ చిన్నం, సాంస్కృతిక కార్యదర్శి సూర్య తేలప్రోలు గారులు కలిసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ వేడుకలో భక్తి గీతాలు, శ్లోకాలు, భజనలు, శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, సినీ నృత్యాలు వంటి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో చిన్నాపెద్దలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రేక్షకులు ఈ ప్రదర్శనలకు ముగ్దులయ్యారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ ఆనంద సాయి (Ananda Sai) ని ఘనంగా సత్కరించారు.
“పసిడి పద్యాలు” పోటీలో పాల్గొన్న చిన్నారులకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. “తెలుగు వాకిలి” అనే పేరుతో తెలుగు బోధన చేస్తున్న వివిధ సంస్థలు ఈ ఉత్సవంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. “Ms. & Mrs. TAGB 2025 – Beauty with Brains” పేరిట జరిగిన పోటీ ప్రముఖ నటుడు, మోడల్ కౌశల్ మండ (Kaushal Manda) గారి ఆధ్వర్యంలో జరిగింది. అనేక మంది మహిళలు, చిన్నారులు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
మొత్తం 35 కార్యక్రమాల్లో 300 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. జబర్దస్త్ బృందం చేసిన హాస్య కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకకు ప్రధానాకర్షణగా నిలిచిన “Anup Rubens Musical Night” రెండు గంటలపాటు సాగింది. సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్ (Anup Rubens) బృందం ప్రేక్షకులను సంగీత మాయలో ముంచెత్తింది.
ప్రత్యేకంగా Telugu Association of Greater Boston కోసం రచించి స్వరపరచిన పాటను వారి బృందం ప్రదర్శించింది, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఉత్సవం విజయవంతంగా నిర్వహించడానికి సాంస్కృతిక కార్యదర్శి సూర్య తేలప్రోలు గారి నేతృత్వంలోని కల్చరల్ టీమ్ రెండు నెలలుగా నిరంతరం కృషి చేసింది.
ఈ కర్యాక్రమాన్ని TAGB కార్యవర్గం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, మండలి అధ్యక్షుడు అంకినీడు రావి (Ankinedu Ravi), ఉపాధ్యక్షుడు కాళిదాస్ సూరపనేని (Kalidas Surapaneni), సభ్యులు పద్మావతి భీమన (Padmavati Bhimana), శేషగిరి రెడ్డి (Seshagiri Reddy), ఎక్స్-ఆఫీసియో దీప్తి గోరా (Deepti Gora) కలిసి విజయవంతంగా నడిపించారు. అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఆడియో, వీడియో సాయంతో ప్రతి ప్రదర్శనను మరింత వైభవవంతంగా మార్చిన టెక్నికల్ టీమ్‌కు, రుచికరమైన విందు భోజనాన్ని అందించిన ఫుడ్ కమిటీకి ప్రత్యేక అభినందనలు.