Canberra, Australia: నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్ (Navya Andhra Telugu Association), కాన్బెర్రా ( నాటా – NATA) ఆధ్వర్యం లో ఈ నెల ఏప్రిల్ 5 వ తారీఖు శనివారం సాయంత్రం గ్రాండ్ ఆల్బర్ట్ హాల్ (Albert Hall) లో విశ్వావసు ఉగాది (Ugadi) మరియు శ్రీ రామ నవమి (Sri Rama Navami) ఉత్సవాలు వేడుకగా, ఘనంగా కాన్బెర్రా తెలుగు కమ్యూనిటీ జరుపుకున్నారు.
ఈ సంవత్సరము ప్రత్యేకత NATA 10th వార్షికోత్సవం కూడా. కాన్బెర్రా తెలుగు పిల్లలు, పెద్దలు సాంప్రదాయబద్దమైన సంగీతము, నృత్యములు (జానపదము, కూచిపూడి, భారతనాట్యము, సమకాలీన పాటలు), నాటకములు (మోహిని భస్మాసుర, పరమానందయ్య గారి శిష్యులు, పర్యావరణ పరిరక్షణ), చిన్నారుల ఫాన్సీ డ్రెస్ (వరల్డ్ లీడర్స్, శాస్త్రవేత్తలు, వీర వనితలు, పరిరక్షకులు దేశ ప్రధానులు, ఆస్ట్రోనౌట్స్) అందరినీ ఆకట్టుకున్నాయి.
NATA ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ చేసిన సీత రామ కళ్యాణము ఊరేగింపు అందరినీ ఆనందంలో ముంచి వేసింది. తెలుగు జాతి గౌరవం ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) గారి ఏక పాత్రాభినయము హిటెట్ష్ గన్నమనేని (Hitetsh Gannamaneni) అద్భుతముగా ప్రదర్శించి అందరికీ ఆ మహనీయుడిని మరోసారి గుర్తు చేశారు.
ఉగాది రోజు పురస్కారం తో ఆయా రంగాలలో సేవ చేసిన వారిని సత్కరించడం మన ఆంధ్రా సంప్రదాయము. ఈ సంప్రదాయం నవ్య ఆంధ్రా తెలుగు అసోసియేషన్ అనుసరిస్తూ, ఈ సంవత్సరము కూడా కమ్యూనిటీ మరియు ప్రొఫెషనల్ రంగాలలో శ్రేష్ఠత సాధించిన Dr మురళి గుడుగుంట్ల (Dr. Murali Guduguntla) – ప్రొఫెషనల్ ఎక్స్లెన్స్, Mr రవి కృష్ణమూర్తి (Ravi Krishnamurthy) గారికి ఈ ఉగాది పురస్కారము అంద చేసారు. ఉగాది పురస్కార గ్రహీతలను ఘనం గా సత్కరించారు.
NATAA 10 సంవత్సరాల విజయవంతమైన జర్నీ నాటా (NATA) ఫౌండర్ (సంస్థాపకులు) Dr ప్రసాద్ తిపిర్నేని (Dr Prasad Tipirneni) గారు అందరికి వివరించి అందులో భాగమైన స్వచ్చంద సహాయకులకు, కమ్యూనిటీ Members కు ధన్యవాదములు అందించారు. ఈ దశాబ్ది సందర్భముగా నిర్వహించిన ఉత్తమ అల్లుడు పోటీలో ముందు నిలిచిన వంశీ కృష రెడ్డి గొలుగూరికి “ఉత్తమ కొడుకు లాంటి అల్లుడు” పురస్కారం అందచేసి అభినందించారు.
ఈ ఉగాది ప్రధాన నిర్వాహకులు NATA President సాహితి పాతూరి ప్రసంగిస్తూ NATA అందరికీ ఫ్రెండ్ అని, అందరూ NATA ఫ్రెండ్స్ అని చెపుతూ కమ్యూనిటీ లీడర్స్ ని వేదికపై ఆహ్వానించారు. ఈ ఉగాది ఉత్సవం “బై ది కమ్యూనిటీ ఫర్ ది కమ్యూనిటీ” అని చెప్పారు. ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం మన భాష, సంప్రదాయం మరియు ఆచారాలు, కట్టుబాట్లు గొప్పతనాన్ని కాపాడుతూ, భావితరాలకు నేర్పించటం అని చెప్పారు.
ఈ వేడుకల కార్యవర్గ సభ్యులు రామ్ వడ్లమూడి (వైస్ ప్రెసిడెంట్), శిరీష పతివాడ (కల్చరల్ చైర్), భాను కుండ్రపు (సెక్రటరీ), రత్నగిరి మండవ (జాయింట్ సెక్రటరీ), రవి అత్తోట (ఫుడ్ & లాజిస్టిక్స్ కోఆర్డినేటర్), Dr. రామచంద్ర కావూరి (పబ్లిక్ ఆఫీసర్), రామ్ కావూరి (అసిస్టెంట్ Treasurer), Nata Advisors సత్య ప్రసాద్ యార్లగడ్డ, మహేష్ తాడేపల్లి, ఎగ్జిక్యూటివ్ members జ్యోష్న సీలబోయిన, శ్రీనివాస్ పరిటాల, సుభాషిణి బండి, ప్రగతి Peswani
మరియు నాటా (NATA) Organisation కు అకింతభావము తో సేవచేసిన కీర్తి తాడేపల్లి, దీప్తి అత్తోట, జ్యోష్న వీరవల్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం ఎంతో కృషి చేశారు. ఎంతో మంది వాలంటీర్స్, పెరఫార్మెర్స్, కోఆర్డినేటర్స్, Music, Dance and Telugu Language Schools అందరు కలసి మెలసి ఈ ఉగాది వేడుకలు విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి సహాయం అందించిన Sponsors ప్లాటినం Sponsor ARRKA గ్రూప్, మరియు గోల్డ్ స్పాన్సర్స్, సిల్వర్ స్పాన్సర్స్ అందరికీ NATA కార్యవర్గం కృజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మైఖేల్ పీటర్సన్ (Michael Pettersson) representing ACT Chief Minister, Minister Suzanne ORR, సెనెటర్ డేవిడ్ పోకాక్ (David Pocock), డేవిడ్ స్మిత్ (David Smith) – మెంబెర్ అఫ్ ఆస్ట్రేలియన్ పార్లిమెంట్ (Member of the Australian Parliament), His Excellency అజయ్ భాయ్ అమ్రిత్ జి హై కమీషనర్ ఫిజి హాజరయ్యారు.
అందరికి పసందైన మామిడికాయ పప్పు, సపోటా కేసరి, వెజ్ చాటపట మరియు ఉగాది పచ్చడి, పెరుగు తో కమ్మని భోజనము వడ్డించారు. కాన్బెర్రా (Canberra) లోని తెలుగు ప్రజలందరూ నవ్య ఆంధ్ర తెలుగు అసోసియేషన్ (Navya Andhra Telugu Association) ఉగాది వేడుకలలో భాగమై పండుగ కుటుంబము, స్నేహితులతో విచ్చేసి కలసి మెలసి ఆనందించారు.