పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వారు పోలాండ్ రాజధాని అయిన వార్సా (Warsaw) లో, గత శనివారం, ఏప్రిల్ 6న ఎంతో ఘనంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మరియు వారి ప్రధమ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. పోలిన్ మ్యూజియం ప్రాణంగం తెలుగుదనంతో, పండుగ సందడి వాతావరణంతో తొణికిసలాడింది.
పోలాండ్ నలుమూలల నుంచి ప్రవాస తెలుగు వారు ఈ Ugadi & ప్రధమ వార్షికోత్సవవేడుకలకు తరలి వచ్చారు. భారత రాయబారి శ్రీమతి నగ్మా మల్లిక్ గారు, యురోపియన్ పార్లమెంట్ మెంబర్స్ మరియు Ministry of Foreign Affairs నుండి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
PoTA తెలుగు వేడుకలు పోలాండ్‌లో తెలుగు సంస్కృతిని మరియు భాషను ప్రోత్సహించడంలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. సాంస్కృతిక శాఖను నిర్వహిస్తున్న స్వాతి అక్కల, నిహారిక గుంద్రెడ్డి , భవాని కందుల గారి ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న పిల్లల తెలుగు నాటకం, ఏకపాత్రాభినయం (పోతన, అల్లూరి సీతారామరాజు, తెనాలి రామకృష్ణ, రుద్రమదేవి, యమలోక యమ) అందరిని అలరించాయి.
Poland Telugu Association (POTA) అధ్యక్షులు చంద్ర భాను గారు ఆహుతులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న ప్రతిఒక్కరికి మరియు తెలుగు కళలను నేర్చుకుంటున్న పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతాభివందనములు అందించారు.
ఈ కారక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన విశ్వశాంతి గదేపల్లి, అనురాధ శ్రీనాధుని గార్లు వారి వాక్చాతుర్యంతో కార్యక్రమాన్ని నడిపించారు. ఈ కార్యక్రమాన్ని లిటిల్ ఇండియా పోలాండ్ వారు సమర్పణ చేయగా వారితో పాటు 25 పాపులర్ ఇండియన్ మరియు పోలండ్ బ్రాండ్స్ వారు స్పాన్సర్స్ గా వ్యవహరించి ఈ వేడుకలను ఎంతో ఘనంగా చేయటానికి సహకరించిన వారందరికీ PoTA కృతఙ్ఞతలు తెలియచేశారు.
450 మందికి పైగా విచ్చేసిన అతిథులకు ప్రియా ఫుడ్స్, తెలుగు ఫుడ్స్ (Telugu Foods), ఇండియా గేట్ బాసుమతి రైస్ వారు వారి ప్రొడక్ట్స్ ను మరియు ఇండియా లాంజ్ రెస్టౌరెంట్, దియా రెస్టౌరెంట్ వారు స్పెషల్ కూపన్స్లక్కీ డ్రా ద్వారా 200 మందికి పైగా అందచేశారు.
ఈ కార్యక్రమానికి PoTA వారు వన్నె తెచ్చేందుకు మన తెలుగు ప్రముఖ ప్లేబాక్ Singers అయిన పృథ్వి చంద్ర , సాకేత్ కొమండూరి, మనీషా ఈరాబత్తుని మరియు వారి బ్యాండ్ (Ichhipad) తో LIVE Musical Concert ను నిర్వచించి అక్కడి తెలుగు వారిని ఎంతగానో రంజింపచేశారు. వారి అద్భుతమైన పాటలతో వచ్చిన యువతను ఉర్రూతలూగించారు.
ఈ ఘనమైన విజయంలో PoTA కీలక సభ్యులు శశి కాట్రగడ్డ, శ్రీదేవి, రాజ్యలక్ష్మి ధూమంత రావు, ఆషా పెరుమాళ్ల, సందీప్ శ్రీనాధుని, సురేశ్ పెరుమాళ్ల, బాపిరాజు ధూమంత రావు, శైలేంద్ర గంగుల, ప్రవీణ్ వెలువోలు, రామ సతీష్ రెడ్డి, సుబ్బిరామ రెడ్డి గుంద్రెడ్డి, కిరణ్మయి, సహృతి, భవాని మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషించారాని వ్వవస్థాపకులు చందు కాట్రగడ్డ, చంద్ర అక్కల గార్లు పేర్కొన్నారు.
మాకు POTA (Poland Telugu Association) ఉగాది & ప్రధమ వార్షికోత్సవ వేడుకలు మరిచిపోలేని మధుర అనుభూతులు మిగిల్చాయి అని టాలీవుడ్ సింగర్స్ (Tollywood Singers) సాకేత్, పృథ్వి చంద్ర, మనీషా ఆనందం వ్యక్తం చేసారు.