Connect with us

Concert

Boston, Massachusetts: Band Capricio ప్రధాన ఆకర్షణగా కాన్సర్ట్ @ TAGB ఉగాది సంబరాలు

Published

on

అమెరికాలోని గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్ (Telugu Association of Greater Boston – TAGB) ఆధ్వర్యంలో ఉగాది (Ugadi Festival) సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రెంథం కింగ్ ఫిలిప్ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకలకు సుమారు 700 మంది తెలుగువారు హాజరై కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

హైదరాబాద్ కి చెందిన Capricio Band కాన్సర్ట్ ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిల్చింది. ఏక్‌నాధ్ (vocals), అదితి భావరాజు (vocals), శ్రవణ్ (keyboard), తేజ (Cajon and Percussions), నిషాంత్ (Acoustic and Electric Guitars), మోసెస్ (Bass Guitar), చైతన్య (Sound Engineer) ఎంతో ఉత్సాహభరితమైన కాన్సర్ట్ తో అందరినీ అలరించారు.

అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో 43 అంశాలలో సుమారు 200 మంది స్థానిక కళాకారులు ప్రదర్శించి మన భాష, సంస్కృతి, సంప్రదాయాలకి అద్దం పట్టారు. ఈ ఉగాదికి Telugu Association of Greater Boston (TAGB) పిల్లలకు, పెద్దలకు ‘పసి’డి పద్యాల పోటీ వీనులవిందుగా నిర్వహించింది.

25 పైగా సభ్యులు ఉత్సాహంగా పాల్గొని పద్య ఆరంభ మణి, పద్య కుశల, పద్య ప్రవీణ మరియు పద్య విశారద స్థాయిలలో బహుమతులు గెలుచుకున్నారు. హాస్యబ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా TAGB నిర్వహించిన “ఆనందం బ్రహ్మానందం” రీల్స్ కాంటెస్ట్ మరొక విశేషం.

ఈ రీల్స్ కాంటెస్ట్ లో ఎన్నికైన మూడు రీల్స్ ని కార్యక్రమంలో ప్రదర్సించి బహుమతులందించారు. అనంతరం TAGB అధ్యక్షురాలు సుధ మూల్పూర్ (Sudha Mulpur) మాట్లాడుతూ.. కొత్త తెలుగు సంవత్సరానికి నాంది పలకడానికి అన్ని వయస్సులవారినీ మెప్పించేలా Band Capricio కాన్సర్ట్ Boston ప్రేక్షకులకోసం తేవగల్గడం చాలా సంతోషకరమైనదన్నారు.

చిన్న పిల్లలనించీ పెద్దవారిదాకా స్థానిక కళాకారులు ఎంతో ఉత్సాహంగా ముందుకురావటం Boston, Massachusetts ప్రాంతపు తెలుగువారందరికీ గర్వకారణం అన్నారు. అలాగే స్థానికంగా స్పాన్సర్స్ ముందుకువచ్చి TAGB సంస్థకి ఉదారంగా ధనసహాయం చేయటంవల్లనే ఇంత చక్కని కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నామన్నారు.

2026-27 TAGB కార్యవర్గం – Executive Committee: సుధ మూల్పూర్ (President), దీప్తి కొరిపల్లి (President Elect), జగదీశ్ చిన్నం (Secretary), సూర్య తేలప్రోలు (Treasurer), మానస కృష్ణ (Cultural Secretary). Board of Trustees: కాళిదాస్ సూరపనేని (Chairman), చంద్ర వల్లూరుపల్లి (Board Member), కల్యాణ్ కాకి (Board Member), శిరీష కేతిరెడ్డి (Board Member), శ్రీనివాస్ గొంది (Ex Officio).

కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్ (Telugu Association of Greater Boston – TAGB) పూర్వ చైర్మన్లను వేదికమీద సత్కరించి వారు చేసిన సేవలకు వారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected