Connect with us

Associations

United Arab Emirates: అంజయ్య చౌదరి లావు తో తెలుగు సంఘం మీట్ & గ్రీట్ @ Dubai

Published

on

తెలుగు అసోసియేషన్ – యూఏఈ (Telugu Association UAE) కార్యనిర్వాహక సభ్యులు దుబాయ్ (Dubai) లోని ఇండియన్ క్లబ్ నందు తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంజయ్య చౌదరి లావు గారు గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో తానా లో వివిధ కీలక పదవులలో బాధ్యతలు నిర్వహించి విశేషమైన సేవలందించారు.

వారి అకుంఠిత సేవా తత్పరత, దార్శనికత, నాయకత్వ లక్షణాలు వారిని తానాలో అత్యంత ప్రతిష్టాకరమైన ఎమర్జెన్సీ సర్వీస్ టీం ఐన తానా టీం స్క్వేర్ (TANA Team Square) నుండి అత్యంత కీలకమైన పదవి ఐన అధ్యక్ష పదవి వరకు సేవలందించే అవకాశం దక్కించుకున్నారు. వీరి నాయకత్వంలో తానా కేర్స్ మరియు తానా టీం స్క్వేర్ ద్వారా వందల కొలది విపత్కర పరిస్థితులలో ఉత్తర అమెరికా (North America) లోని తెలుగు వారికి సహాయ సహకారములు అందించారు.

అంజయ్య చౌదరి లావు గారు తానా (TANA) సంస్థ గత నాలుగు దశాబ్దలుగా అమెరికాలోని తెలుగు వారికి అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తానా సుదీర్ఘ కాలంగా సేవలందించడానికి ప్రధాన కారణమైన సంస్థాగత నిర్మాణం, వివిధ విభాగాల రూప కల్పన, కార్యక్రమాల నిర్వహణా విధానాలు, బోర్డు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీల పరస్పర సహకారములు, నిధుల సేకరణ వంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా వివరించారు.

తెలుగు అసోసియేషన్ (Telugu Association UAE) ప్రస్తుత మరియు పూర్వ కార్యనిర్వాహక సభ్యులు తెలుగు అసోసియేషన్ యూఏఈ (United Arab Emirates) ఆవిర్భావం నుండి నేటివరకు నిర్వహించిన సాంస్క్రితిక, సామాజిక, సేవా కార్యక్రమాలను వివరించారు. అంజయ్య చౌదరి లావు గారు తెలుగు అసోసియేషన్ యూఏఈ ప్రారంభించిన కొద్ది సంవత్సరాలలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించటం ఎంతో సంతోషించదగిన విషయమని తెలియచేస్తూ భవిష్యత్తులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలతో యూఏఈ లోని తెలుగు వారికి సేవలందించాలి అని తానా తరుపున శుభాకాంక్షలు తెలియచేసారు.

ఈనాటి ఆత్మీయ సమ్మేళానికి చొరవ తీసుకున్న యూఏఈ తెలుగు అసోసియేషన్ (Telugu Association UAE) వారిని అభినందిస్తూ, ఇటువంటి సమ్మేళనాలు మున్ముందు కూడా చేపట్టాలని, తద్వారా తానా మరియు ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు సంఘాలు (Telugu Association) పరస్పర సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా తెలుగు వారికి మరింత సేవా కార్యక్రమాలు చేసే అవకాశం దొరుకుతుంది అని ఈ సందర్భంగా తెలియచేసారు.

అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) గారు తానా మరియు ఇతర తెలుగు సంఘాలు అమెరికాలోని తెలుగు వారికి అందిస్తున్న సేవా కార్యక్రమాలు యూఏఈ (United Arab Emirates) తెలుగు అసోసియేషన్ కి ఎంతో స్ఫూర్తిదాయకం కాగలవని ఈ కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు ఆకాంక్షిస్తూ యూఏఈ తెలుగు అసోసియేషన్ తరుపున శ్రీ అంజయ్య చౌదరి లావు గారిని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి యూఏఈ తెలుగు అసోసియేషన్ తరుపున ప్రస్తుత కార్య నిర్వాహక చైర్మన్ వివేకానంద్ బలుస, ప్రెసిడెంట్ మసివుద్దీన్, జనరల్ సెక్రటరీ విజయ భాస్కర్, ట్రెజరర్ శ్రీనివాస్ గౌడ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ సురేంద్ర ధనేకుల, ఆంధ్రా సంక్షేమ విభాగ డైరెక్టర్ శ్రీధర్, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ భీం శంకర్ బంగారి, తెలంగాణ వెల్ఫేర్ విభాగ డైరెక్టర్ చైతన్య చకినాల, పూర్వ కార్యనిర్వాహక బృందం నుండి చైర్మన్ దినేష్ కుమార్ ఉగ్గిన, ట్రెజరర్ మురళి కృష్ణ నూకల, తెలంగాణ వెల్ఫేర్ విభాగ డైరెక్టర్ షేక్ షా వలి విచ్చేసారు. వీరితో పాటు ఫారెస్ట్ నేషన్ ఎండి శరత్ నల్లమోతు ఈ కార్యక్రమానికి విచ్చేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected