UAE తెలుగు అసొసియేషన్ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగాదుబాయి లోని వెస్ట్ జోన్ హోటల్ లో మార్చ్ 4 సాయంత్రం వుమెన్ అండ్ చైల్డ్ షో ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తరఫున సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీ సాయి ప్రకాష్ సుంకు గారి ఆధ్వర్యంలో శ్రీమతి ఫ్లోరెన్స్ విమల, శ్రీమతి ఉషాదేవి లు సంధానకర్తలు గా వ్యవహరించారు.
తెలుగు అసోసియేషన్ తరఫున శ్రీ మోహన కృష్ణ గారు సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగత ఉపన్యాసం చేసారు. భారతదేశం లో అనాదిగా మహిళకు ఒక ప్రత్యేక స్టానం ఇవ్వబడిందని, మహిళలను మాతృమూర్తిగా, దేవతా మూర్తిగా, జన్మభూమిగా కొలుచుకుంటాము అని చెప్పారు.
అటువంటి మూర్తులు ప్రస్తుతం అష్ట ఐశ్వర్య ప్రదాయినులుగా అనేక రంగాలలో రాణిస్తూ మానవాళికి స్పూర్తిప్రదాయకులుగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు.య.ఏ.ఈ లోని ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి వచ్చి వివిధ రంగాలలో రాణించి విశిష్ట సేవలను అందిస్తున్న మహిళామణులను, తెలుగింటి ఆడపడుచులను సాదరంగా సన్మానించారు.
విద్యా రంగం:-
. శ్రీమతి ఆయేషా షేక్ గారు
. శ్రీమతి ఉదయలక్ష్మి భమిడిపల్లి గారు
వైద్య రంగం:-
డాక్టర్ సుధా మధుసూదన్ గారు
వ్యాపార రంగం:-
శ్రీమతి శిరీష మానేపల్లి గారు
శ్రీమతి ఏంజిలో జో గారు
శ్రీమతి సుభద్ర రావు గారు
న్యాయవాద రంగం & సామాజిక సేవా రంగం:-
శ్రీమతి షీలా థామస్ గారు
శ్రీమతి అనూరాధ వొబ్బిలిశెట్టి గారు
సాంస్కృతిక రంగం:-
శ్రీమతి ప్రీతి తాతంభొట్ల
ఆర్ధిక రంగం:-
. శ్రీమతి నిశ్చలా దేవి గారు
సామాజిక సేవా రంగం:-
. శ్రీమతి గీత గారు
ఈ సందర్భంగా దుబాయి లోని చిన్నారులు చేసిన రెట్రో నృత్య ప్రదర్శనలు, స్పెషల్ కిడ్స్ ప్రదర్శనలు, ఆట పాటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.తెలుగు అసోసియేషన్ అద్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన గారు, ఉపాద్యక్షుడు మసిఉద్దీన్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ వివేకానంద బలుసా గారు, కల్చరల్ డైరెక్టర్ వెంకట సురేష్ గారు, కమ్యూనిటీ డైరెక్టర్ రవి వుట్నూరి, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేడ్కర్ కార్యక్రమానికి విచ్చేశారు.
తెలుగు అసోసియేషన్ తరఫున అడ్డగాళ్ళ మోహన కృష్ణ, ఫహీమ్, విజయభాస్కర్, భీం శంకర్, శరత్ చంద్ర కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు.