Connect with us

Associations

హోరుమనిపించిన టెన్నెస్సీ తెలుగు సమితి ఉగాది సంబరాల సంగీత కచేరి

Published

on

ఏప్రిల్ 27న అమెరికాలోని టెన్నెస్సీ తెలుగు సమితి చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన పాటల కచేరి అత్యంత విజయవంతంగా జరిగింది.  అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో ఉగాది సంబరాలలో భాగంగా నిర్వహించిన ఈ లైవ్ కాన్సర్ట్ లో గాయనీ గాయకులు సుమంగళి, గీతా మాధురి, రోహిత్, శ్రీకాంత్ పాల్గొనగా మెహర్ చంటి లైవ్ బాండ్ తో అలరించారు.

సుమారు 800 మంది ఆహుతులు పాల్గొన్న ఈకార్యక్రమాన్ని ముందుగా షాలిని వేమూరి భరతనాట్యంతో ప్రారంభించారు. క్రిస్టల్ ఈవెంట్స్ వారు చక్కని స్టేజి డెకరేషన్ మరియు ఫోటో బూత్ రెడీ చేయగా, మామ్ అండ్ మీ కాన్సెప్ట్ తో నిర్వహించిన ఫాషన్ షో  అందరిని ఆకట్టుకుంది. తొలుత సోలో, తర్వాత డ్యూయెట్ పాటలతో స్టేజి మార్మోగిపోయింది. కొన్ని పాటలకి లైవ్ డాన్సులు చెయ్యడం కొసమెరుపు. యాంకర్ సాహిత్య తన వ్యాఖ్యానంతో అబ్బురపరిచింది.

టెన్నెస్సీ తెలుగు సమితి తదుపరి కార్యవర్గాన్ని అధ్యక్షులు దీప్తి రెడ్డి సభకు పరిచయం చేసారు. ఈసందర్భంగా కమిటీ సభ్యులను, స్పాన్సర్స్ మరియు సింగర్స్ అందరిని సత్కరించారు. టాలెంట్ షో మరియు తానా క్యూరీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రాఫుల్ విజేతలకు అయిదు గ్రాముల గోల్డ్ కాయిన్స్ అందజేయడం విశేషం. అలాగే వినయ గోపిశెట్టి రూపకల్పన చేసిన విభా ఫాషన్ షో అందరిని అవ్వురమనిపించింది. గ్రాండ్ ఫినాలే లో భాగంగా చేసిన డ్రమ్స్ షో మరియు సింగర్స్ సంగీతం స్టాండింగ్ ఒవేషన్ తో అదరహోమనిపించింది. పెద్దలు కార్యక్రమాన్ని ఆస్వాదించడంకోసం తమ పిల్లల కొరకు విడిగా ప్రొఫెషనల్ ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చెయ్యడం విశేషం.

చివరిగా అధ్యక్షులు దీప్తి రెడ్డి ఈ కార్యక్రమానికి సహాయసహకారాలు అందించిన టిటియస్ కార్యవర్గ సభ్యులు, అడ్వైసరీ కమిటీ, యూత్ కమిటి, స్పాన్సర్స్, అలాగే ఉగాది పచ్చడితోపాటు రుచికరమైన భోజనాన్ని అందించిన అమరావతి రెస్టారంట్,  విజయవంతంచేసిన ప్రేక్షకులు, ప్రత్యేకంగా ప్లాటినం స్పాన్సర్షిప్ ద్వారా లైవ్ బాండ్ ని సమర్పించిన డాక్టర్ దీపక్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.


Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected