Connect with us

Associations

భేషుగ్గా టెన్నెస్సీ తెలుగు సమితి సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published

on

జనవరి 26 న టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు భేషుగ్గా నిర్వహించారు. స్థానిక విఘ్నేశ్వరుని గుడిలో దీప్తి రెడ్డి దొడ్ల అధ్యక్షతన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం నిర్వహణలో జరిగిన ఈ వేడుకలలో సుమారు 600 మందికి పైగా పాల్గొన్నారు. సంక్రాతి, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒకే రోజు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా భారత, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు.

జ్యోతి ప్రజ్వలనతో మొదలైన వేడుకలలో, ముగ్గుల పోటీలలో భాగంగా తెలుగు ఆడపడుచులు పోటాపోటీగా వేసిన ముగ్గులు పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేశాయి. బొమ్మల కొలువు, చిత్రలేఖనం, చర్చా వేదిక తదితర పోటీలలో పిల్లలు విరివిగా పాల్గొన్నారు. పిల్లలకు భోగిపళ్లు శాస్త్రోక్తంగా నిర్వహించడంతో ముసి ముసి నవ్వులతో కేరింతలు కొట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల విజేతలకు ట్రోఫీలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు వంటి వివిధ పోటీల విజేతలకు బహుమతులు మరియు ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుడీ బాగ్స్ అందజేశారు. అలాగే కళా రంగానికి చేస్తున్న సేవలకు గాను మోనికా కూలే గారిని సత్కరించారు.

సాయంసమయాన గాయకులు సందీప్ కూరపాటి మరియు గాయని శృతి నండూరి పాత కొత్త పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చేసిన జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నృత్యాలు గురించి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి వయసులొలికించే ఫాషన్ షో మరియు టాలీవుడ్ బ్యూటీ క్వీన్ శ్రీదేవి కి ట్రిబ్యూట్ లో భాగంగా చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ అదుర్స్.  ఇండియా నుంచి తెప్పించిన సంక్రాంతి స్పెషల్ అరిసెలతోపాటు అమరావతి రెస్టారెంట్ వారు అందించిన పసందైన విందు భోజనం అందరూ చక్కగా ఆస్వాదించారు.అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ ఈ వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రత్యేకించి యూత్ కమిటీ సభ్యులను టెన్నెస్సీ తెలుగు సమితి సేవా కార్యక్రమాలవైపు ప్రోత్సహిస్తున్న వారి తల్లితండ్రులను కొనియాడారు. అలాగే ఈ ఈ వేడుకల నిర్వహణలో సహాయం చేసిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులు, ఆడియో సహకారం అందించిన డీజే శ్రీమంత్ బృందావనం, వీడియో మరియు ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్ జానర్ తదితరులను అభినందించారు.

Advertisement
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected