Connect with us

News

పాఠశాలకు స్టేజ్, బ్యాగులు, ఆర్ధిక సాయం అందించిన TTA @ Thummanpet, Nagarkurnool, Telangana

Published

on

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) సేవా డేస్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా TTA బృందం తెలంగాణ అంతటా పర్యటించి ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మంపేట కు చేరుకుంది.TTA నాయకులు సైదులు గారు తన స్వగ్రామంలో ప్రభుత్వ స్కూల్ కు స్టేజ్ నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలకు అందించడం జరిగింది.

గణిత శాస్త్ర నిపుణులు రామానుజం గారి జయంతి సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగాలను TTA నాయకులు మనోహర్ మరియు నరసింహ పేరుక గారు తిలకించారు. విద్యార్థుల ప్రతిభకు అబ్బురపడి పిల్లలను అభినందించారు.

ఉత్సాహంగా స్కూల్ పిల్లలు తాము స్వంతంగా తయారు చేసిన గణిత సూత్రాలను వివరించే అట్ట యంత్రాలు పిల్లల కు చదువు పై ఉన్న ఆసక్తి తెలియజేస్తుంది. TTA ఇలాంటి ఆసక్తి గల పిల్లలను తప్పకుండా మరోసారి సందర్శించి వారికి అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు చేస్తామని TTA నాయకులు మాట్లాడుతూ తెలిపారు.

తదనంతరం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు TTA సంస్థ BOD నరసింహ పెరుక మరియు TTA కోశాధికారి మనోహర్ గారిని వేదిక పైకి స్వాగతంగా ఆహ్వానించారు. వేదికపైన పెద్దలకు బ్యాడ్జ్ అలంకరణ చేసిన విద్యార్థులు ప్రారంభ కార్యక్రమం ముగించారు. TTA నాయకులకు పూలబోకే తో స్వాగతం పలికారు.

TTA నాయకులకు స్కూల్ ఆచార్యులు శాలువాతో సన్మానించారు. పాఠశాల ప్రధాన అధ్యాపకులు రవీందర్ గారు మాట్లాడుతూ.. TTA బృందానికి కృతజ్ఞత లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ మళ్ళీ చేయాలనికొరారు. రమేష్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు, ఇప్పటి TTA నాయకులు పాఠశాలకు సేవలందించడం మంచి విషయమని తెలిపారు.

TTA సభ్యులకు ఫ్రెండ్స్ యూత్ ప్రసిడెంట్ అధ్యక్షుడు అనిల్ గౌడ్ మాట్లాడుతూ దన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా ఉన్న TTA కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. నృత్యం చేసిన విద్యార్థులకు TTA నాయకులు అభినందనలు తెలిపారు.

గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫజల్ గారు మాట్లాడుతూ.. TTA కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలను ఎలా పెంచాలి అనే విషయం పై రీసెర్చ్ చేయగలిగితే గొప్పగా ఉంటుందని తెలిపారు. పిల్లల సృజనాత్మక ఆలోచనలను ఆయన ప్రత్యేకంగా అభినదించారు.

TTA నాయకులు నరసింహ పెరుక గారు మాట్లాడుతూ.. TTA ఏర్పడ్డ విధానం మరియు చేసిన సేవా కార్యక్రమాలు అన్నింటినీ వివరించారు. రానున్న రోజుల్లో ఈ స్కూల్ ను కూడా దత్తత తీసుకోనున్నామని తెలిపారు. ప్రిన్సిపాల్ అడిగిన గ్రీన్ బోర్డ్ త్వరలో అందిస్తామని ప్రామిస్ తెలిపారు.

TTA నాయకులు మనోహర్ గారు మాట్లాడుతూ.. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఈ స్టేజ్ నిర్మాణం జరగడం అద్భుతం అని అన్నారు.స్టేజ్ అనేది కేవలం ఒక ఇటుకల నిర్మాణంగా చూడొద్దని, అన్న ఆయన ఇది ఒక మంచి ఉపన్యాసకుడు,స్టేజ్ డ్రామా, కమిడియన్ఇ లా ఎంతో మందిని తయారు చేసే ఒక వేదికగా చూడాలని అన్నారు.

పిల్లల్లో పిల్లవాడిగా కలిసి దాతల తల్లి తండ్రికి కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రామానుజం గురించి పిల్లలకు వివరించారు. TTA బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ తిరుపతి రావు మాట్లాడుతూ TTA కు అభినందనలు తెలిపారు. TTA నాయకులు నరసింహ గారు చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఇద్దరికి మోమొంటో అందించి 25 వందల రూపాయలు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

ధైర్య ప్రదర్శన చేసిన ముగ్గురు పిల్లలకు TTA నాయకులు మనోహర్ గారు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. TTA నాయకులు చదువులో ప్రతిభ కనబరిచిన ప్రతి క్లాస్ లో ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేసారు. కార్యక్రమానికి సహకరించిన బ్రహ్మచారి గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు TTA నాయకులు నరసింహ పెరుక మరియు మనోహర్ గారు.

పాఠశాల అధ్యాపకులు TTA నాయకత్వానికి దన్యవాదాలు తెలిపారు. TTA నాయకులు ప్రధాన అధ్యాపకులు రవీందర్ గారితో పాటు రమేష్ పైమరీ టీచర్, దాతలలో ఒకరు సాయి గారి తండ్రి ఏర్రయ్య గారిని శోబాన్ గారి తండ్రి రఘుపతి గారిని, శ్యామ్ గారి బాబాయిని, ఆర్కిటెక్చర్ బ్రహ్మచారి గారిని మరియు సర్పంచ్ తిరుపతి రావు గారిని శాలువా తో సన్మానించి మెమొంటొ తో సత్కరించారు.

TTA FOUNDER
TTA Founder – Dr. Pailla Malla Reddy

ADVISORY COUNCIL MEMBERS
TTA Advisory Committee Chair – Dr. Vijayapal Reddy
TTA Advisory Committee Co-Chair – Dr. Mohan Reddy Patalolla

EXECUTIVE COMMITTEE & SEVA DAYS TEAM
TTA President – Vamshi Reddy Kancharakuntla
TTA President-Elect – Naveen Reddy Mallipeddi
TTA General Secretary – Kavitha Reddy
Seva Days Coordinator – Suresh Reddy Venkannagari
Seva Days Coordinator – Durga Prasad Seloj
India Coordinator – Dr. Dwarakanatha Reddy

Seva Days Advisor/ Health & Wellness Advisor – Jyothi Reddy Dudipala
Foundation Services Chair – Santosh Gantaram
Community Services Chair – Narsimha Peruka
TTA Joint Secretary – Shiva Reddy Kolla
TTA Joint Treasurer – Manohar Bodke
TTA National Coordinator – Pradeep Mettu
Ethics Committee Director – Ganesh Madhav Veeramaneni

BOARD OF DIRECTORS
Sangeetha Reddy
Mayur Reddy Bandaru
Venkat Gaddam
Abhilash Reddy Mudireddy

CONVENTION REGIONAL ADVISORS
Manoj Chinthireddy
Anil Errabelli

STANDING COMMITTEE, REGIONAL VICE PRESIDENTS & MEMBERS
Vani Gaddam
Pradeep Boddu
Aahlaad Reddy
Srikanth Reddy Singireddy
Vinod Kumar Gardas

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected