అమెరికాలో మొట్టమొదటి జాతీయ తెలంగాణ సంస్థ అయినటువంటి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association – TTA) ఏర్పాటు చేసినప్పటినుండి తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను, కళలను, సేవలను ముందుకు తీసుకెళుతుంది.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి, ప్రస్తుత అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల, కోచైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, గత చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి లతో మొదలుపెట్టి TTA సంస్థ అభివృద్ధి, ప్రణాళికలు, ఆలోచనలు తదితర విషయాలపై ఇండియా ట్రిప్ లో ఉన్న ప్రస్తుత అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల టీవీ9 తో కూలంకుషంగా మాట్లాడారు.
వంశీ రెడ్డి వాలంటీర్ గా, ఆర్.వీ.పీ గా, బోర్డ్ సభ్యునిగా, ఈవీపీ గా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా తన ప్రస్థానం ఎలా మొదలయ్యింది, అలాగే అంచలంచలుగా ఎదిగి ప్రస్తుత 2023-2024 అధ్యక్షులుగా సేవలందిస్తున్న వరకు తన 8 సంవత్సరాల TTA ప్రయాణాన్ని విడమరిచి వివరించారు.
అమెరికాలోని 32 రాష్ట్రాల్లో ఉన్న TTA చాఫ్టర్స్ గురించి, లక్ష్యాలు, రాబోయే తరాల పిల్లల కోసం చేపట్టే కార్యక్రమాలు, టిటిఏహెల్ప్ లైన్, అమెరికా వచ్చే విద్యార్థులకు అందించే సేవలు, ఎంట్రప్రెన్యూర్స్ కి మెంటరింగ్, మహిళా సాధికారత, వాలంటీర్ అవార్డ్స్, కోవిడ్ టైం లో TTA చేసిన సేవలు, బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ పండుగల నిర్వహణ ఇలా పలు విషయాలపై మనసు విప్పి మాట్లాడారు.