తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association – TTA) గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సేవా డేస్ నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ (Hyderabad Necklace Road) లో డిసెంబర్ 16న 5కె రన్ నిర్వహించారు.
ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ రన్ ఫర్ హెల్త్ (Run for Health) అంటూ నిర్వహించిన ఈ TTA కార్యక్రమం లో LB నగర్ MLA సుదీర్ రెడ్డి (Sudheer Reddy) ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. సుదీర్ రెడ్డి మాట్లాడుతూ TTA సేవాభావం కలిగిన సంస్థ అని మాతృభూమి కి సేవచేయాలనే ఆలోచన తో కదిలిన TTA సుదీర్ఘకాలం కొనసాగాలని అన్నారు.
5K రన్/వాక్ (5K Run/Walk) కార్యక్రమాన్ని TTA నాయకత్వం మరియు MLA సుదీర్ రెడ్డి ఉత్సాహంగా ప్రారంబించారు. TTA ప్రెసిడెంట్ వంశి రెడ్డి కంచరకుంట్ల వచ్చిన ఆహుతులను ఉత్సహపరుస్తు జుంబా డాన్స్ (Zumba Dance) ను ఆస్వాదించారు. ఉత్సాహంగా కొనసాగిన ఈ కార్యక్రమం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది.
TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla) మాట్లాడుతూ TTA సమాజ సేవా కోసం ఏర్పడింది అన్నారు. YOYO టీవీ అధినేత మల్లారెడ్డి TTA సుదీర్ఘకాలం కొనసాగాలని కోరారు. TTA నాయకులు విజయపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో TTA సేవలు మరువలేనివి అని అన్నారు.
TTA అడ్వైసర్ మోహన్ రెడ్డి పటోళ్ల మాట్లాడుతూ సేవా డేస్ మరియు అమెరికాలో ఇప్పటికే TTA సాధించిన విజయాలను వివరించారు. TTA సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ గారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని TTA ఆరోగ్యానికి కట్టుబడి ఉందని తెలిపారు. సంపంగి అధినేత మాట్లాడుతూ అరోగ్యం పై పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు.
TTA (Telangana American Telugu Association) ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెద్ది మాట్లాడుతూ ఇప్పుడు రెండు సంత్సరాల కు ఒకసారి చేసే చేస్తున్న కార్యక్రమం TTA సేవా డేస్ ఇకనుంచి ప్రతి సంవత్సరం చేస్తామని ప్రకటించారు. డా. ద్వారక నాద్ TTA సేవా డేస్ కోఆర్డినేషన్ బ్యాక్ ఎండ్ వర్క్ చేసినందుకు TTA ధన్యవాదాలు తెలిపింది.
TTA (Telangana American Telugu Association) కార్యదర్శి కవితారెడ్డి మాట్లాడుతూ 5K రన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను అన్నారు. TTA హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైజర్, మహిళా నాయకురాలు జ్యోతి రెడ్డి ఇకపై సమాజసేవ లో TTA మరింత ఉత్సాహం తో పనిచేస్తుందని తెలిపారు. పల్లవి కాలేజెస్ విద్యార్థులను కార్యక్రమానికి ఆహ్వానించారు.
MLA సుదీర్ రెడ్డి గారిని TTA నాయకత్వం శాలువాతో సన్మానించి మెమంటో తో సత్కరించారు. కార్యక్రమంలో జుంబా డ్యాన్స్ (Zumba Dance) ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. LB నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి (LB Nagar MLA Sudheer Reddy) కూడా యూత్ ను ఉత్సహపరుస్తూ జుంబా డ్యాన్స్ లో పాల్గొన్నారు.
పల్లవి కాలేజ్ విద్యార్థుల నృత్య ప్రదర్శన, మణిపూర్ కళాకారుడు చేసిన మణిపూర్ సంప్రదాయ ప్రదర్శన (కర్ర ప్రదర్శన) అద్భుతంగా కొనసాగింది. కార్యక్రమం ఆద్యంతం ఉత్సహబరితంగా కొనసాగింది. TTA (Telangana American Telugu Association) నాయకత్వం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
సేవాడేస్ (TTA Seva Days) కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు, INDIAN కోఆర్డినేటర్ గా డా. డి ద్వారకనాథ రెడ్డి గారు, కో – కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు, హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు, నర్సింహా పెరుక గారు – కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రసిడెంట్ గా వంశిరెడ్డి కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, కార్యదర్శిగా కవితారెడ్డి గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు.
సేవా డేస్ లో పాల్గొన్న TTA సభ్యులు
Shiva Reddy Kolla – Joint Secretary Manohar Bodke – Joint Treasurer Pradeep Mettu – National Coordinator Ganesh Veeramaneni – Ethics Committee Director Sangeetha Reddy – Board of Director Venkat Gaddam – Board of Director Pradeep Boddu – Committee Chair Vani Gaddam – Committee Member
తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. TTA Founder Pailla Malla Reddy Garu, Advisory Consul Chair – Vijayapal Reddy గారు, Co-Chair – Mohan Patalolla గారు, Member – Bharat Reddy Madadi గార్ల ఆధ్వర్యంలో 2015 లో మొదలై, ప్రస్తుత ప్రెసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్నది.
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవా డేస్ కార్యక్రమాలను ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నామని, మిగతా రోజుల కార్యక్రమాలలో కూడా తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల, ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, సేవా డేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి కోరారు.