Telangana: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) సేవ డేస్ లో భాగoగా జ్యోతి రెడ్డి బోర్డు ఆఫ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచిత ఆరోగ్య శిబిరం మరియు దివ్యాంగ పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమంను మల్లికాంబ మనోవికాస కేంద్రం లో ఈ నిర్వహించడం జరిగింది.
ఈ టిటిఏ సేవా కార్యక్రమంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపు ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు రిబన్ కట్ చేసి ప్రారంభించడo జరిగింది. వారు మాట్లాడుతు.. సేవా డేస్ లో భాగంగా శ్రీనివాస్ నగర్ కాలనీ లోని మహిళలకు ఉచితంగా గైనకాలజి, కంటి, ముక్కు, చెవిటి పరీక్షలు నిర్వహించి వారికీ ఉచితంగా మందులు పంపిణి చేయడం సంతోషంగా ఉందన్నారు.
తదుపరి జ్యోతి రెడ్డి (Jyothi Reddy) గారు మాట్లాడుతుడిసెంబర్ 8 నుండి డిసెంబర్ 22, 2025 వరకు వివిధ జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని అన్నారు. ఈ సంస్థకి సాయి బాబా గుడి నిర్మించి ఇవ్వడం నాకు చాలా ఆత్మ సంతృప్తి ని ఇస్తుంది అన్నారు. అనాధ పిల్లల కోసం వసతి గృహలు నిర్వహిస్తున్న వారికీ ప్రభుత్వ సహకారం అందించాలన్నారు.
దివ్యాంగ పిల్లల శారీరక, మానసిక మరియు సామాజిక అభివృద్ధికి తోడ్పడటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జ్యోతి రెడ్డి ఫౌండేషన్ (Jyothi Reddy Foundation) ద్వారాదివ్యాంగ పిల్లల కోసం ప్రత్యేక సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించాను అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సేవాభావంతో సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో TTA ముందడుగు వేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమానికి TTA సభ్యులు విజయ విజయపాల్ రెడ్డి AC Chair,శ్రీ నవీన్ రెడ్డి మల్లిపెద్ది (ప్రెసిడెంట్),శ్రీ విశ్వ కాండి ( సేవా డేస్ చైర్) L.N రెడ్డి (10th Anniversary Chair), శివా రెడ్డి కొల్ల (జనరల్ సెక్రటరీ), ప్రవీణ్ చింత (కన్వెన్షన్ కన్వినర్ ), నరసింహ పెరుక, Interantional వైస్ ప్రెసిడెంట్ ), సహోదర్ రెడ్డి పెద్ది రెడ్డి (trasurer), స్వాతి చెన్నూరు (joint Tresurer ), శ్రీనివాస్ గూడూర్ (soveiner chair ), సంతోష్ గంగారాము (బోర్డు అఫ్ డైరెక్టర్ ), వాణి గడ్డం (కల్చరల్ చైర్ ), ఉషా రెడ్డి (మాట్రిమోనిల్ చైర్ ), రామా వనమా (అడ్వైసర్ కల్చరల్ ), రఘు అలుగుబెల్లి (బోర్డు అఫ్ డైరెక్టర్), మల్లిక్ రెడ్డి అక్కిన పెల్లి ,ప్రదీప్ బొడ్డు గారు పాల్గొన్నారు.