TTA నాయకుల ఏర్పాట్లకు ఏమాత్రం తగ్గకుండా మొదటి రోజు బాంక్వెట్ డిన్నర్, రెండవరోజు Threeory Band కాన్సర్ట్ ఆహతులను ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. మూడు రోజుల పండుగ లాంటి TTA కన్వెన్షన్ (Convention) నిన్న మే 26, ఆదివారంతో ఘనంగా ముగిసింది.
కన్వెన్షన్ (TTA Convention) మూడో రోజున ఉదయాన్నే తెలంగాణ (Telangana) రాష్ట్రం, భధ్రాచలం నుంచి విచ్ఛేసిన పండితులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం శుభప్రదంగా నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం అందరూ ప్రసాదం అందుకున్నారు.
వివిధ ఎక్సిబిట్ రూమ్స్ లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. TTA స్టార్ ఫైనల్స్, బ్యూటీ పాజంట్ ఫైనల్స్, వివిధ పార్టీల & ఫాన్స్ సమావేశాలు, బిజినెస్ సెమినర్స్, ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్, ఫిట్నెస్ వర్కషాప్ వంటి బ్రేకౌట్ సెషన్స్ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని (Telangana Culture) ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క, ఓరుగల్లు కోట, పోతురాజు, చార్మినార్, తెలంగాణ తల్లి వంటి సెట్టింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆహ్వానితులందరూ ఫోటోలు దిగుతూ కన్పించారు. మహిళలు షాపింగ్ బూత్స్ (Shopping Stalls) దగ్గిర కోలాహలంగా తిరిగారు.
సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) వీనుల విందుగా ఉన్నాయి. 25K, 50K, 100K డోనార్స్ ని, కార్పొరేట్ స్పాన్సర్స్ ని ఘనంగా సత్కరించారు. బ్యూటీ పాజంట్ (Beauty Pageant) మరియు TTA స్టార్ విజేతలకు క్రౌన్, బహుమతులు పెద్దల చేతులు మీదగా అందజేశారు.
అనంతరం తెలంగాణ రాష్ట్రం, ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, People Tech TG విశ్వప్రసాద్, తెలుగు సినీ నిర్మాత (Tollywood Producer) దిల్ రాజు, టాలీవుడ్ టాప్ నటి శ్రీలీల తదితరులను సన్మానించారు. ఇక పరంపర టీం వారు గుడి సంబరాలు అంటూ చేసిన నృత్యం స్టాండింగ్ ఒవేషన్ దక్కించుకుంది.
ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association – NATA) వ్యవస్థాపకలు డా. ప్రేమ్ రెడ్డి కి TTA కార్యవర్గం, బోర్డు సభ్యులు మరియు నాటా లీడర్షిప్ సమక్షంలో TTA జీవన సాఫల్య పురస్కారాన్ని (Lifetime Achievement Award) అందించారు. ఈ సందర్భంగా డా. ప్రేమ్ రెడ్డి తన జీవిత సత్యాలను యువతను ఇన్స్పైర్ చేసేలా వివరించారు.
అప్పుడే విచ్చేసిన డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ని వేదిక పైకి సాదరంగా ఆహ్వానించి శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు. ఈ సందర్భంగా క్రౌడ్ డాన్స్ చేయాలని కోరగా, సున్నితంగా తిరస్కరించి, తనదైన స్టైల్ లో సినిమా (DJ Tillu) డయలాగులు చెప్పి నవ్వులు పూయించారు.
ఎప్పటిలానే యాంకర్స్ సుమ (Suma Kanakala) మరియు రవి అందరినీ నవ్విస్తూ కార్యక్రమాలను ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారు. యువత శ్రీలీల, డీజీ టిల్లు (Siddhu Jonnalagadda) తో సెల్ఫీలు దిగడానికి ఎగబడడంతో సెక్యూరిటీ వాళ్ళు కొంచెం కష్టపడాల్సివచ్చింది.
ఆ తర్వాత, TTA ప్రస్తుత అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల, TTA కన్వెన్షన్ కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు లను కుటుంబ సమేతంగా వేదిక మీదకు ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా వీరు ఈ కన్వెన్షన్ (Convention) నిర్వహణ వివరాలు పంచుకొని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
వివిధ కన్వెన్షన్ (Convention) కమిటీల సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. చివరిగా తెలుగు సైనీ సంగీత దర్శకులు తమన్ (Thaman S) థండర్ మ్యూజికల్ కాన్సర్ట్ (Live Concert) తో యువతను అలరించారు. దీంతో TTA Seattle Convention కి ఘనమైన ముగింపు పలికినట్లైంది.