Connect with us

Convention

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిన TTA Convention రెండో రోజు, అలరించిన Threeory Band కాన్సర్ట్

Published

on

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ (TTA Mega Convention) మొన్న శుక్రవారం, మే 24న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కన్వెన్షన్ మొదటి రోజైన బాంక్వెట్ డిన్నర్ విజయవంతం కాగా, నిన్న కన్వెన్షన్ రెండో రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టాయి.

ఉదయాన్నే భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిర్వహించిన ఇండియా డే పెరేడ్ భిన్నత్వంలో ఏకత్వాన్ని (Unity in Diversity) మరోసారి తెలియపరిచింది. బోనాలు, బతుకమ్మ, పోతురాజు తో TTA మహిళలు, నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్ (Inaugural) కి విచ్చేశారు.

గణపతిని స్మరించుకుంటూ క్లాసికల్ డాన్స్ ప్రదర్శనతో వేదికపై తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ రెండో రోజు కార్యక్రమాలను ప్రారంభించారు. గౌరవంగా నుంచొని అమెరికా, భారతదేశం (US & India National Anthems) జాతీయ గీతాలతోపాటు, తెలంగాణ (Telangana) రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

వ్యాఖ్యాతలు రవి, దీప్తి TTA కార్యవర్గాన్ని వేదిక పైకి ఆహ్వానించి TTA ప్రస్థానంపై వీడియో ప్రదర్శించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy, మాజీ మంత్రి మరియు ప్రస్తుత శాసన సభ్యులు మల్లారెడ్డి చామకూర (Chamakura Malla Reddy) సమక్షంలో జ్యోతి ప్రజ్వలన గావించారు.

ఈ సందర్భంగా TTA అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla), వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు.

అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) కొనసాగించారు. సమాంతరంగా వివిధ బ్రేకౌట్ రూమ్స్ లో TTA Startup Cube, మాట్రిమోనీ, CME, అష్టావధానం, TTA స్టార్ ఫైనల్స్, బ్యూటీ పాజెంట్ (Beauty Pageant) టాలెంట్ రౌండ్, ఫైర్సైడ్ చాట్ (Fireside Chat), యూత్ సెషన్స్ (Youth Sessions), పొలిటికల్ మీట్ & గ్రీట్స్ నిర్వహించారు.

ఇక సాయంత్రం మెయిన్ స్టేజీపై సాంస్కృతిక కార్యక్రమాల (Cultural Programs) మధ్యలో మాజీ మంత్రి మరియు ప్రస్తుత శాసన సభ్యులు మల్లారెడ్డి చామకూర, పాలు అమ్ముకున్న, పూలు అమ్ముకున్న, ఇంతటి స్థాయికి వచ్చా అంటూ, ఇన్స్పైరింగ్ గా చేసిన మాస్ స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. అందరూ నవ్వుతూ కరతాళ ధ్వనులతో స్వాగతించారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అమృత్ రెడ్డి ప్రసంగించగా, వీరిని TTA నాయకత్వంసన్మానించింది . అలాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరుపతి నుండి తెచ్చిన శాలువాలతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తరపున అంటూ TTA నాయకులను సన్మానించారు.

అలాగే టాలీవుడ్ హీరోయిన్స్ శ్రీలీల, మెహ్రీన్ (Mehreen Pirzada) లను వేదిపై ఆహ్వానించి, ప్రసంగాల అనంతరం సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీలీల (Sreeleela) కుర్చీ మడతపెట్టి సాంగ్ కి డాన్స్ చేసి అలరించారు. లంచ్ మరియు డిన్నర్ మెన్యూ బాగుంది. యాంకర్స్ సుమ, రవి విట్టీ యాంకరింగ్ తో ఆకట్టుకున్నారు.

డా. హరనాథ్ పోలిచెర్ల (Haranath Policherla) చేసిన సేవలకు గాను TTA లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు (Lifetime Achievement Award) అందజేశారు. చివరిగా హైదరాబాద్ నుండి వచ్చిన త్రీయరీ బ్యాండ్ (Threeory Band) వారు లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ తో TTA (Telangana American Telugu Association) కన్వెన్షన్ రెండో రోజుకి ఘనమైన ముగింపు పలికారు.

TTA (Telangana American Telugu Association) మెగా కన్వెన్షన్ రెండవ రోజు కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/TTA Mega Convention in Seattle Day 2 ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected