Connect with us

Events

Seattle: 3000 మందితో 100 తీన్మార్ డప్పులతో ఊరేగిస్తూ TTA బతుకమ్మ వేడుకలు

Published

on

. దేశ విదేశాల్లో తెలంగాణ బతుకమ్మకు ఆదరణ

. వాషింగ్టన్ లోనీ సియాటెల్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో, వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (WATA), వాషింగ్టన్ తెలుగు సమితి (WATS) సౌజన్యం తో ఘనంగా బతుకమ్మ వేడుకలు

. సాంప్రదాయ బద్దంగా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించిన మహిళలు

. 100 తీన్మార్ డప్పులతో ఆడి పాడిన తెలుగు మహిళలు

. TTA ఫౌండర్ డా. మల్లారెడ్డి పైళ్ల, అడ్వైజరీ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కోచైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, మెంబర్ భరత్ రెడ్డి మాదాడి ల అద్వితీయ సహకారం

. కార్యదర్శి కవితారెడ్డి అమెరికా అంతటా TTA బతుకమ్మ ఈవెంట్స్ సమన్వయం

తెలంగాణ రాష్ట్ర (Telangana State) సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహిళల పండుగ బతుకమ్మను వాషింగ్టన్ లోని సియాటెల్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించారు.

మహిళలు అంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య ఆడి పాడి వేడుకలను నిర్వహించారు. వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla) ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాబీ వీర్క్, జాయ్ సిందు, సంవిర్క్ కు పాల్గోన్నారు. వీరు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను దేశ విదేశాల్లో విస్తృత పరచడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

ఈ సందర్భంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు వంశీ రెడ్డి గారు మాట్లాడుతూ.. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వాషింగ్టన్ నగరంలోని సియటెల్ లో నిర్వహించే బతుకమ్మ వేడుకలను వీక్షించండానికి ఇక్కడి ప్రజలు ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తుంటారని అన్నారు.

ఈ ఏడాది ఘనంగా నిర్వహించిన బతుకమ్మ (Bathukamma) వేడుకల్లో అమ్మవారిని వైవిధ్యబరితంగా అలంకరించడంతో పాటు 100 తీన్మార్ డప్పులతో బతుకమ్మలను ఊరేగిస్తూ బోతెల్ సిటీ లోని నార్త్ క్రీక్ హై స్కూల్ కు తీసుకువచ్చామన్నారు. అనంతరం దుర్గాపూజ కోలాటాలు బతుకమ్మ ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించారు.

సుమారు 3 వేల మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనగా వచ్చిన ప్రతి ఒక్కరికి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) కార్యవర్గ సభ్యులు భోజనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మక మైన బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల వాషింగ్టన్ (Washington) ప్రజలు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోియేషన్ కార్యవర్గాన్ని అభినందించారు.

ఈ బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించి విజయవంతం చేసిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA కార్యవర్గ సభ్యులని (నవీన్ గోలి, మనోజ్ చింత రెడ్డి, గణేష్ వీరమనేని, మనోహర్ బొడ్కే, ప్రదీప్ మెట్టు, సంగీత బొర్ర, మాణిక్యం తుక్కపురం, పవన్ రెడ్డి నూకల, అజయ్ రెడ్డి, హరి కిషోర్ గుంటూరు, ప్రియాంక క్రిష్న, మధు మల్లిది, అనురాధ కుంట, ప్రియాంక ముంజులురి, హరి కట్కూరి, కేశవరెడ్డి బొమ్మినేని, శ్శ్రీధర్ ప్రతికాంతం, రవీందర్ వీరవల్లి, నవీన్ ఓరుగంటి, సాయి రెడ్డి, శివ వెదురుపాటి, శ్రీకాంత్, సురెష్ థాంద, ప్రసాద్ సెనపథి, శ్యాం సుందర్ రెడ్డి దేశం, లవ కుమార్ రేపాల, పర్థ సారధి వెలదంది, రాజేఎందెర్ అజమేర) వంశీ రెడ్డి గారు అభినందించారు.

అలాగే వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (Washington Telangana Association) నిర్వాహకులను (చంద్రసేనా శ్రీరామోజు, రవిందెర్ రెడ్డి సదు, సందీప్ప్ భుషనము, భరథ్ రెడ్డి చిలుపురి, వినొధ్ కుమర్ ఈఇనొల్ల, సునిల్ నరయంచెత్త్య్, స్వెథ కమల, వినీథ్ కమినెని, షంకర్ చమకురి, ప్రవీన్ కుమర్ కుంచకురి), వాషింగ్టన్ తెలుగు సమితి (Washington Telugu Samithi) నిర్వాహకులను (జయపాల్ రెడ్డి దొడ్డ, సునీత కొత్తపల్లి, రజెష్ గుదవల్లి, మాధు రెద్ది, ప్రాసాద్ కొందురు, రాము థమ్మినెని, మురలి థుముల) కూడా అభినందించారు.

ఈ సందర్భంగా టీవీ యాంకర్స్ పల్సర్ బైక్ కండక్టర్ ఝాన్సీ, జబర్దస్త్ డాన్స్ మాస్టర్ రమేష్ ఫోక్ సింగర్, లావణ్య డప్పు, మనోహర్ సింగర్ రమణ లు ఆట పాటలతో సియాటిల్ (Seattle) వాసులను ఉర్రూత లుగించారు. వీక్షించే ప్రజలు ఆనందోత్సవాలతో పులకించిపోయారు.

ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలతో మమ్మల్ని మంత్ర ముగ్దులను చేస్తున్న టి టి ఏ బృందాన్ని ముఖ్యంగా Telangana American Telugu Association (TTA) ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల గారిని సియాటెల్ ప్రవాస భారతీయులు కొనియాడారు.

TTA కార్యవర్గ సభ్యులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, కవితారెడ్డి, సహోదర్ పెద్దిరెడ్డి, డా. దివాకర్ జంద్యం, శివారెడ్డి కొల్లా, మనోహర్ బొదుకే, ప్రదీప్ మెట్టు, ప్రసాద్ కునారపు సభ్యుల సహకారానికి అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla) కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected