Connect with us

Events

ఆత్మీయ పలకరింపులతో TTA అలయ్ బలయ్ @ Sayreville, New Jersey

Published

on

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, టిటిఎ వ్యవస్థాపకులు డా’ పైళ్ల మల్లారెడ్డి అశీసులతో, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అమెరికా అంతటా ఘనంగా నిర్వహిస్తున్న ఏకైక సంస్థ. ఇందులో భాగంగా అడ్వైజరీ చైర్ డా విజయపాల్ రెడ్డి, అడ్వైసరీ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, అడ్వైసరీ మెంబర్ భరత్ రెడ్డి మాదాడి లు మొట్ట మొదటి సారిగా తెలంగాణ కి ప్రీతీ పాత్రమైన అలయ్ బలయ్ కార్యక్రమాన్నిజరపాలని నిర్ణయించారు.

టిటిఎ అధ్యక్షులు వంశీ రెడ్డి అధ్యక్షతన జరిగిన టిటిఎ అలయ్ బలయ్ కు వివిధ నగరాలలో జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. టిటిఎ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల స్వంత రాష్టం న్యూజెర్సీ లో అలయ్ బలయ్ సంబరాలు అంబరాన్ని అంటాయి. టిటిఎ జాయింట్ సెక్రటరీ శివా రెడ్డి కొల్ల మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ సుధాకర్ ఉప్పల, నర్సింహ పెరుక, నరేందర్ యారవ నేతృత్వంలో టిటిఎ న్యూజెర్సీ రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ మధుకర్ రెడ్డి, సాయి గుండూర్ ఆధ్వర్యమున Burke’s Park, Sayreville నందు శనివారం, Aug 19న నిర్వహించిన సంబరాలు 500 మంది ఆహుతులతో కిక్కిరిసింది.

అలయ్ బలయ్ అంటేనే ఆత్మీయ పలకరింపు, తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకమైన ఆహారం మరియు సాంప్రదాయ వినోదాన్ని కలుగచేయటం. అలయ్ బలయ్ సంబరాల్లో టిటిఎ Membership Chair అరుణ్ అర్కాల నేతృత్వంలో ప్రత్యేకంగా తయారు చేసిన చక్కటి తెలంగాణ విందు భోజనం అతిధులు ఆస్వాదించారు. అదేవిదంగా అలయ్ బలయ్ కండువాలు ధరించి ఒకరికొకరు ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అమెరికా లో జరుగుతుందా లేక తెలంగాణ లోన అన్నట్లు మయిమరిపించారు.

అలయ్ బలయ్ కార్యక్రమంలో చిన్నపిల్లలు చాల ఉత్సాహంగా పాల్గొన్నారు, టిటిఎ యూత్ టీం సభ్యులు ఇషితా మూలే, మోక్ష మాలి, రిషిత జంబుల, సహస్ర ఎల్లంపల్లి, హాసిని అర్కాల, కీర్తి పేరుక, నిమిషా పేరుక అట పాటలు నిర్వహించారు. అలాగే ప్రముఖ తెలుగు సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ కార్యక్రమంలో తన పాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు.

అలాగే టిటిఎ న్యూ జెర్సీ టీం మరియు TTA కమ్యూనిటీ సర్వీసెస్ టీం చైర్ నర్సింహా పెరుక అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు అయిన సీనియర్ సిటిజన్స్ ని సన్మానించి పెద్దల పైన తమకు వున్నగౌరవాన్ని చాటిచెప్పారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శాంతి నర్రా, New Jersey Middlesex County Deputy Director, ఉపేంద్ర చివుకుల, Former Commissioner, New Jersey Board of Public Utilities, అజయ్ పాటిల్ , Councilman, Edison Township, నర్సింహా రెడ్డి దొంతిరెడ్డి, టిటిఎ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హాజరు అయ్యి టిటిఎ సభ్యులకి మరియు ఈవెంట్ కి హాజరు అయిన అతిధుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

వివిధ తెలుగు ఆర్గనైజషన్స్ TFAS, ATA, NATS, TANA ప్రతినిధులు హాజరయ్యి అలయ్ బలయ్ శుభాకాంక్షలు తెలిపారు. TTA న్యూ జెర్సీ టీం సభ్యులు అరుణ్ అర్కాల, ప్రశాంత్ నలుబంధు, నవీన్ కౌలూరు , శంకర్ రెడ్డి వులుపుల, రాజా నీలం, శ్రీనివాస్ రెడ్డి మాలి , శ్రీనివాస్ జక్కిరెడ్డి, ప్రణీత్ నల్లపాటి , శివ నారా, వెంకీ, సుమంత్, దీప జలగం, సంధ్య కాసుల, నవీన్ యలమండల, కృష్ణ మోహన్ రెడ్డి, అష్రిత్ వచ్చిన వారి అందరికి ధాన్యవాదాలు తెలియ చేసారు.

Chief Guests Attended: Shanti Narra, New Jersey Middlesex County Deputy Director
Upendra Chivukula, Former Commissioner, New Jersey Board of Public Utilities
Ajay Patil, Councilman, Edison Township, New Jersey
Narsimha Reddy Donthireddy, TTA Executive Vice President

TTA Team: Mohan Reddy Patalolla – TTA Advisory Council Co-Chair
Shiva Reddy Kolla – TTA Joint Secretary

Board of Directors: Sudhaker Uppala, Narsimha Peruka, Narendar Yarava

Regional Vice Presidents: Madhukar Reddy, Sai Gundur

Membership Chair: Arun Reddy Arkala

TTA New Jersey Core Team: Prashanth Nalubandhu, Naveen Kouluru, Shankar Reddy Vulupula, Raja Neelam, Srinivas Reddy Maly, Srinivas Jakkireddy, Praneet Nallapati, Shiva Nara, Venky, Sumanth, Deepa Jalagam, Sandhya Kasula, Naveen Yalamandala, Krishna Mohan Reddy, Ashrith

TTA Youth Team: Ishita Moole, Moksha Maly, Rishita Jambula, Sahasra Yellampalli, Hasini Arkala, Kirti Peruka, Nimisha Peruka

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected