చికాగోలోని ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ వారు ఏప్రిల్ 15న ఉగాది మరియు శ్రీ రామ నవమి వేడుకలు స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ లేక్ కౌంటీ ఆలయ ప్రాంగణంలో సంస్థ అధ్యక్షులు హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు.
సోమలత ఎనమందల, హేమంత్ పప్పు, ప్రసాద్ మరువాడ, ప్రశాంతి తాడేపల్లి ఆధ్వర్యంలో స్వప్న పులా, అర్చన మిట్ట, రేఖా వేమూరి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. ప్రణతి కలిగొట్ల వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సుష్మిత గన్ రెడ్డి సహకారంతో హేమంత్ పప్పు, సోమలత ఎనమందల, సందీప్ గడ్డం , రామ్ శరబు అద్భుత వేదిక అలంకరణ ప్రేక్షకుల కనువిందు చేసింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి జగదీశ్ కానూరు, శ్రీనాథ్ వాసిరెడ్డి, వీరాస్వామి అచంట, మధు ఆరంబాకం, దిలీప్ రాయలపూడి, భాను సిరమ్, గుప్త నాగుబండి ఎంతో తోడ్పడ్డారు.
ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల నడుమ అన్ని వయస్సుల వారు పాల్గొని తెలుగు సంస్కృతి ని ప్రతిఫలించే సంగీత, నాట్య కార్యక్రమాలతో పాటు చిత్ర గీత నృత్యాలు మరియు పాటలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమానికి సుప్రియ ముప్పవరపు అందించిన అచ్చ తెలుగు ఉగాది విందు భోజనాలు ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదించారు. సాదిస్ ఇంబా శేఖర్ ఫోటో మరియు వీడియో చిత్రీకరించారు.