చికాగోలోని ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ జనవరి 28 శనివారం రోజున సంక్రాంతిమరియు గణతంత్ర దినోత్సవ సంబరాలు స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ లేక్ కౌంటీ ఆలయ ప్రాంగణంలో సంస్థ అధ్యక్షులు శ్రీ హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుపుకుంది.
ప్రసాద్ మరువాడ, హేమంత్ పప్పు ఆధ్వర్యంలో రేఖా వేమూరి, స్వప్న పులా, ప్రశాంతి తాడేపల్లి, అర్చన మిట్ట మరియు శిల్ప మచ్చ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. హేమంత్ పప్పు సహకారంతో శ్రీమతి సోమలత ఎనమందల, దిలీప్ రాయపూడి చేసిన వేదిక అలంకరణ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి 300లకు పైగా వచ్చిన సభ్యుల నడుమ అన్ని వయస్సుల వారు పాల్గొని, తెలుగు సంస్కృతి ని ప్రతిబింబించే సంగీత, నాట్య కార్యక్రమాలతోపాటు, చిత్ర గీత నృత్యాలనూ ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి శ్రీనాథ్ వాసిరెడ్డి, వీరాస్వామి అచంట, రవి వేమూరి, భాను సిరమ్, రామకృష్ణ తాడేపల్లి, శిరీష కుప్పం, సహస్ర వీరపల్లి తదితరులు ఎంతో తోడ్పడ్డారు.
ఈ కార్యక్రమానికి స్థానిక తానా నాయకులు హేమ కానూరు, హను చెరుకూరి, కృష్ణ మోహన్ చిలంకూరు, రవి కాకర, చిరు గళ్ళ విచ్చేసి పార్టిసిపెంట్స్ కు సర్టిఫికెట్స్ బహుకరించారు.